23 రేప్ లు చేసిన 29 మంది పోలీసులు

లక్నో: ఉత్తరప్రదేశ్ లో కొందరు పోలీసులు కీచకులైనారు. మహిళలకు రక్షణ కల్పించకుండ వారి మీద అత్యాచారాలు చేసి కొందరు జైలు పాలైనారు. అనేక కేసులు పెండింగ్ లో ఉన్నాయి. పోలీసులు రేప్ చెయ్యడం ఏమిటి అనుకుంటే అది పోరపాటే.

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ అసెంబ్లీ సమావేశాలలో స్వయంగా ఈ విషయం అంగీకరించి లిఖితపూర్వకంగా వివరాలు వెల్లడించారు. బీజేపీ శాసన సభ్యుడు శ్యామ్ దేవ్ రాయ్ చౌదరి అడిగిన ప్రశ్నకు ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు.

29 cops named in 23 rape cases in 14 months in Uttar Pradesh

ఉత్తరప్రదేశ్ లో గత 14 నెలలలో నమోదు అయిన 23 రేప్ కేసులలో 29 మంది పోలీసులు నిందితులుగా ఉన్నారని చెప్పారు. పలు అత్యాచారాలు పోలీస్ స్టేషన్ లలో జరగడం దారుణం అన్నారు. ఇప్పటి వరకు 11 మంది పోలీసులను అరెస్టు చేశామని చెప్పారు.

విచారణ పూర్తి అయిన తరువాత 8 మంది పోలీసుల పేర్లు ఎఫ్ఐఆర్ ల నుండి తొలగించామని అన్నారు. మిలిగిన కేసులు విచారణలో ఉన్నాయని అఖిలేష్ యాదవ్ వివరించారు. యుపీలో శాంతిభద్రతలు కాపాడవలసిన పోలీసులు కీచకులుగా మారిపోతున్నారని పెద్ద ఎత్తున విమర్శలు ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+