వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పది నెలల బేబీ నోట్లోంచి 29 స్టాపులర్ పిన్స్ తీశారు

By Pratap
|
Google Oneindia TeluguNews

గ్యాంగ్‌టార్: ఓ పది నెలల బేబీ నోటి కుహరంలో ఒక్కటి కాదు, రెండు కాదు 29 స్టాపులర్ పిన్స్ ఇరుక్కున్నాయి. గ్యాంగ్‌టాక్‌లోని సెంట్రల్ రెఫరల్ ఆస్పత్రి వైద్యులు శస్త్రచికిత్స చేసి విజయవంతంగా వాటిని బయటకు తీశారు.

సిఆర్‌హెచ్ నాసిక, గొంతు విభాగం, నెక్ సర్జరీ శాఖ అధిపతి అధిపతి ప్రొఫెసర్ సువమోయ్ చక్రవర్తి మంగళనవారంనాడు శస్త్రచికిత్సకు నేతృత్వం వహించారు. ప్రమాదవశాత్తు 29 స్టాపులర్ పిన్స్ బేబీ మింగిందని, అవి నోటి కుహరంలో ఇరుక్కుపోయాయని ఆయన చెప్పారు.

29 stapler pins removed from 10-month-old baby's oral cavity

చేతులతో వాటిని తీయడానికి కుటుంబ సభ్యులు ప్రయత్నించారని, దాంతో పిన్స్ సెట్ నాసికాగ్రసని (నాసోఫారింక్స్) వద్దకు వెళ్లాయని, దాంతో సమస్య తీవ్ర రూపం దాల్చాయని ఆయన అన్నారు.

సువమోయ్ చక్రవర్తి నేతృత్వంలో, డాక్టర్ సుభాశిష్ ముఖర్జీ, డాక్టర్ సౌమ్యజిత్ దాస్‌ల సహకారంతో సిఆర్‌హెచ్ సర్జన్స్ విజయవంతంగా శస్త్రచికిత్స చేసి పిన్స్‌ను బేబీ నోటి నుంచీ తీసేశారు.

English summary
Stapler pins stuck inside the mouth of a 10-month-old baby was successfully removed through an operation at the Central Referral Hospital (CRH) in Gangtok.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X