రంజిత్ సిన్హాకు సుప్రీం షాక్: 2జి దర్యాప్తు నుంచి ఔట్
న్యూఢిల్లీ: సిబిఐ అధికారులపై సుప్రీంకోర్టు గురువారం తీవ్రంగా మండిపడింది. కోర్టు గదిలో ఉన్న సిబిఐ అధికారులను తప్పు పట్టింది. కోర్టు గది నుంచి వెళ్లిపోయి మీ విధులు మీరు నిర్వర్తించడంటూ ఆదేశాలు జారీ చేసింది. రంజిత్ సిన్హాపై వచ్చిన ఆరోపణలపై తన వాదనను వినిపించిన సిబిఐ జాయింట్ డైరెక్టర్‌పై కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది.
"మీరు సిబిఐ డైరెక్టర్ ఏజెంట్లు కారు. మీరు ఆయన మౌత్ పీస్ కాకూడదు" అని వ్యాఖ్యానించింది. సిబిఐ డైరెక్టర్ రంజిత్ సిన్హా 2జి కేసులో జోక్యం చేసుకున్నారని, అది పూర్తిగా ఏజెన్సీ వైఖరికి తగింది కాదని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆనంద్ గ్రోవర్ సుప్రీంకోర్టుకు విన్నవించారు.

సిన్హా వైఖరిని అంగీకరిస్తే 2జి కేసు నాశనమై ఉండేదని ఆయన అన్నారు. తమ అధికారి ఒకరు కోవర్టుగా వ్యవహరించారని రంజిత్ సిన్హా బుధవారం చేసిన వాదనతో సిబిఐ విభేదించింది. 2జి కుంభకోణం కేసు దర్యాప్తు నుంచి తప్పుకోవాలని రంజిత్ సిన్హాను సుప్రీంకోర్టు ఆదేశించింది. రంజిత్ సిన్హాపై ఆరోపణల్లో ఎంతో కొంత నిజం లేకపోలేదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. రంజిత్ సిన్హా చర్యలు సిబిఐ ప్రతిష్టను పెంచేలా లేదని అభిప్రాయపడింది. 2జి కుంభకోణం దర్యాప్తులో రంజిత్ సిన్హా ఇంకెంత మాత్రం జోక్యం చేసుకోకూడదని తేల్చి చెప్పింది.
తన కింది స్థాయి ఉద్యోగి రస్తోగిని కావాలనే దర్యాప్తు నుంచి రంజిత్ సిన్హా తప్పించారని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. 2జి స్కామ్ దర్యాప్తులో వేలు పెట్టవద్దని సుప్రీంకోర్టు రంజిత్ సిన్హాను ఆదేశించింది. అంతా సజావుగా సాగుతున్నట్లు తమకు అనిపించడం లేదని చెప్పింది. దర్యాప్తును సిబిఐ ఉన్నతాధికారికి అప్పగించాలని సూచించింది.
తమ సంస్థలో డీఐజీ ర్యాంకు సీనియర్ అధికారి సంతోష్ రస్తోగి తనపై కోవర్ట్ వ్యవహారాలు నడిపినట్లు సిబిఐ డైరెక్టర్ రంజిత్ సిన్హా బుధవారంనాడు సుప్రీం కోర్టు దృష్టికి తెచ్చారు. ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ తనపై అబద్ధపు-నిరాధార ఆరోపణలు చేయడానికి వీలుకల్పించేలా కొన్ని పత్రాలను అందజేసిందని ఆయనేనని ఆరోపించారు. చీఫ్ జస్టిస్ దత్తు నేతృత్వంలోని ధర్మాసనం ఎదుట విచారణ సందర్భంగా ఆయన ఈ మేరకు వివరించారు.
నాలుగున్నర గంటలపాటు సాగిన విచారణలో సిన్హా తరఫు న్యాయవాది వికాస్‌రాజ్, ప్రశాంత్ భూషణ్ తరఫు న్యాయవాది దుష్యంత్ దవేల మధ్య వాదోపవాదాలు తీవ్రమవడంతో జస్టిస్ దత్తు జోక్యం చేసుకుని సర్దిచెప్పారు. సిబిఐలో ‘గూఢచారి' ఉన్నారని, ఆయనే న్యాయవాది ప్రశాంత్ భూషణ్‌కు పత్రాలు అందజేస్తున్నాడని సంస్థ చీఫ్ రంజిత్ సిన్హా సుప్రీం కోర్టుకు తెలిపారు. సీనియర్ ఐపిఎస్ అధికారి సిబిఐకి చెందిన సమాచారం చేరవేయడంవల్లే తనపై అభూతకల్పనలు, అవాస్తవాలతో కూడిన ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!!












Click it and Unblock the Notifications