2జీ కేసులో రాజా, కనిమొళిలు నిర్దోషులు: పటియాల కోర్టు సంచలన తీర్పు

న్యూఢిల్లీ: దేశంలో సంచలనం సృష్టించిన 2జీ స్పెక్ట్రమ్ స్కాం కేసు(2జీ స్పెక్ట్రం కేటాయింపులో చోటు చేసుకున్న కుంభకోణం)పై సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం(పటియాల హౌస్ కోర్టు) గురువారం తీర్పును వెలువరించింది. ప్రధాన నిందితులుగా ఉన్నన ఎ రాజా, కనిమొళిని నిర్దోషులుగా కోర్టు ప్రకటించింది.

వీరితోపాటు నిందితులుగా ఉన్న మిగితావారిని కూడా నిర్ధోషులుగా ప్రకటించింది. ఈ తీర్పు ఎ రాజా, కనిమొళిలకు పెద్ద ఊరటగానే చెప్పవచ్చు. నేరం నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని కోర్టు వ్యాఖ్యానించింది.

కనిమొళి, రాజాతోపాటు మాజీ టెలీకాం సెక్రటరీ సిద్ధార్త్ బెహురా, రాజా ప్రైవేటు సెక్రటరీ ఆర్కే చండోలియా, స్వాన్ టెలీకాం ప్రమోటర్స్ షాహిద్ ఎస్మాన్ బల్వా, వినోద్ గోయంకా, యూనిటెక్ లిమిటెడ్ ఎండీ సంజయ్ చంద్ర, రిలియన్స్ అనిల్ ధీరూభాయి అంబానీ గ్రూప్(రాడాగ్) టాప్ ఎగ్జిక్యూటివ్స్ గౌతమ్ దోషి, సురేంద్ర పిపారా, హరినాయర్ లు దోషిగా తేలారు.

కాగా, వీరిపైన నమోదైన మూడు కేసుల్లోనూ వీరిని నిర్దోషులుగా ప్రకటించడంతో కనిమొళి, రాజా ఇళ్ల వద్ద కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. కేసు విచారణ సందర్భంగా కనిమొళి తల్లి, భర్త కూడా కోర్టుకు వచ్చారు. కాగా, తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టులో అప్పీల్ చేసేందుకు సీబీఐ, ఈడీ సిద్ధమవుతున్నాయి.

అంతకుముందు కే విచారణ నేపథ్యంలో టెలికాం శాఖ మాజీ మంత్రి ఎ రాజా, డీఎంకే ఎంపీ కనిమొళి సహా పలువురు నేతలు, కార్పొరేట్‌ సంస్థల అధికారులు ఈ కేసులో నిందితులుగా ఉన్నారు. వీరు కోర్టుకు హాజరయ్యారు.

ఏడేళ్ల క్రితం యూపీఏ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న కుంభకోణంపై సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దాఖలు చేసిన వేర్వేరు కేసులపై తీర్పును ఇవ్వబోతున్న సందర్భంగా డిసెంబర్ 21న నిందితులంతా వ్యక్తిగతంగా హాజరు కావాలని న్యాయస్థానం ఇదివరకే ఆదేశించిన విషయం తెలిసిందే.

2G spectrum verdict likely today: The charges, accused and witnesses

కాగా, ఈ కేసుపై 2011లో విచారణ ప్రారంభమయింది. ఆరు నెలల నుంచి యావజ్జీవం వరకు శిక్షపడేందుకు అవకాశం ఉన్న అభియోగాలను 17 మందిపై మోపారు. 122 అనుమతుల్ని మంజూరు చేయడంలో రూ.30,984 కోట్ల మేర ప్రభుత్వాదాయానికి నష్టం వాటిల్లినట్లు సీబీఐ ఆరోపించింది. ఈ నేపథ్యంలో కోర్టు తీర్పుపై ఆసక్తి నెలకొంది. దేశంలో జరిగిన కుంభకోణాల్లో 2జీ కూడా ఒకటి కావడం గమనార్హం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+