వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

2nd వేవ్ దెబ్బకు మళ్లీ ఆర్థిక అనిశ్చితి -ప‌రిస్థితులు దారుణంగా ఉన్నాయన్న నీతి ఆయోగ్ -విదేశీ వల్లే

|
Google Oneindia TeluguNews

కరోనా మహమ్మారి తొలి దశ వ్యాప్తిలో లాక్ డౌన్ కారణంగా ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలడం, కోట్ల మంది ఉద్యోగ, ఉపాధిని కోల్పోవడం తెలిసిందే. తొలి వేవ్ కంటే ప్రమాదకరంగా ప్రస్తుత రెండో దశ వ్యాప్తిలో రెట్టింపు సంఖ్యలో కొత్త కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. మన దేశంలో గతేడాదిలా పూర్తి స్థాయి లాక్ డౌన్ పెట్టనప్పటికీ, దాదాపు అన్ని రాష్ట్రాలు కఠిన ఆంక్షలు విధించాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే దేశంలో మళ్లీ ఆర్థిక అనిశ్చితి తప్పదంటున్నారు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్.

క‌రోనా సెకండ్ వేవ్ కారణంగా ప్ర‌స్తుతం దేశంలో ప‌రిస్థితుల చాలా దారుణంగా ఉన్నాయ‌ని నీతి ఆయోగ్ వైస్ చైర్మ‌న్ రాజీవ్ కుమార్‌ అన్నారు. వినియోగ‌దారులు, పెట్టుబ‌డిదారుల సెంటిమెంట్ల విష‌యంలో మ‌రింత అనిశ్చితి త‌ప్ప‌ద‌ని, క‌రోనా వ‌ల్ల గ‌తంలో కంటే ప్ర‌స్తుత ప‌రిస్థితులు మ‌రింత క్లిష్టంగా మారిన మాట వాస్త‌వ‌మేన‌ని అన్నారు.

కరోనా విలయం: ప్రధానికి చెక్ పెడుతూ రాహుల్ గాంధీ కీలక నిర్ణయం -వంచన వద్దన్న ప్రియాంక -మోదీ ఇలాకరోనా విలయం: ప్రధానికి చెక్ పెడుతూ రాహుల్ గాంధీ కీలక నిర్ణయం -వంచన వద్దన్న ప్రియాంక -మోదీ ఇలా

2nd Covid Wave Could Spark Greater Economic Uncertainty says Niti Aayog VC Rajiv Kumar

నిజానికి కొవిడ్‌ను పూర్తిగా లేకుండా చేసే స్థితికి ఇండియా చేరుకున్న సమయంలో.. యూకే, ఇత‌ర దేశాల వేరియంట్లు దేశంలోకి ప్ర‌వేశించ‌డంతో ప‌రిస్థితి తలకిందులై, విలయం మళ్లీ మొదలైందనన్నారు రాజీవ్ కుమార్. సెకండ్ వేవ్ సేవ‌ల రంగంలాంటి వాటిపై ప్ర‌త్య‌క్ష ప్ర‌భావం చూప‌డంతోపాటు ఆర్థిక కార్య‌క‌లాపాల‌పై పెద్ద ఎత్తున ప‌రోక్ష ప్ర‌భావం చూపే అవ‌కాశం ఉన్న‌ద‌ని చెప్పారు. మరి,

డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణికి భారీ షాక్ -ఎస్టీ హోదాపై హైకోర్టు నోటీసులు -రాజీనామా చేయాలంటూడిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణికి భారీ షాక్ -ఎస్టీ హోదాపై హైకోర్టు నోటీసులు -రాజీనామా చేయాలంటూ

Recommended Video

Innovative Auto Driver Jakkaiah Growing Plants In Auto

తొలి దశ లాక్ డౌన్ లో దెబ్బతిన్న రంగాలను ఆదుకోడానికి కేంద్రం ఆత్మనిర్భర్ ప్యాకేజీ ప్రకటించిన తీరుగా సెకండ్ వేవ్ లోనూ ఉద్దీపనలు ఉండొచ్చా? అనే ప్రశ్నకు సమాధానంగా.. కేంద్ర ఆర్థిక శాఖ అంచనాల తర్వాత త‌గిన స‌మ‌యంలో ప్ర‌భుత్వమే మ‌రో ఉద్దీప‌న ప్యాకేజీపై స్పందిస్తుంద‌ని రాజీవ్ స్ప‌ష్టం చేశారు. కరోనా రెండో దశ వ్యాప్తి తీవ్రంగా ఉన్నప్పటికీ 2022, మార్చి 31తో ముగిసే ఈ ఆర్థిక సంవత్స‌రంలో మాత్రం వృద్ధి రేటు 11 శాతంగా ఉండొచ్చని నీతి ఆయోగ్ వీసీ ఆశాభావం వ్యక్తం చేశారు.

English summary
The country needs to prepare for "greater uncertainty" in terms of consumer as well as investor sentiments due to the second wave of coronavirus infections, and the government will respond with fiscal measures as and when required, Niti Aayog Vice Chairman Rajiv Kumar said today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X