చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వెల్లూరు, చిత్తూరు జిల్లాలో 3.5 తీవ్రతతో భూకంపం: పరుగులు తీసిన జనం

|
Google Oneindia TeluguNews

చిత్తూరు/వెల్లూరు: చిత్తూరు జిల్లాలో భూకంపాలు వణికిస్తున్నాయి. వరుస భూకంపాలతో జిల్లా వాసులు భయాందోళనకు గురవుతున్నారు. గురువారం మధ్యాహ్నం తర్వాత చిత్తరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. దీంతో భయంతో జనం ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

తమిళనాడులోని ఉత్తర వెల్లూరులోని కొన్ని ప్రాంతాల్లో గురువారం మధ్యాహ్నం 3:14 గంటల ప్రాంతంలో 3.5 రిక్టార్ స్కేల్ తీవ్రతతో భూకంపం సంభవించింది. బెంగళూరులో రెండ్రోజుల క్రితం అదే స్థాయిలో భూకంపం వచ్చింది. వేలూరు - బెంగళూరు దూరం దాదాపు 220 కి.మీ. వెల్లూరుకు సమీపంలోని చిత్తూరు జిల్లా పరసర ప్రాంతాల్లోనూ భూ ప్రకంపనలు చోటు చేసుకుంది.

 3.5 Richter quake occurred 50 km west-northwest of Vellore and Chithoor too felt it

కాగా, ఇటీవల చిత్తూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో తరచూ భూ ప్రకంపనలు చోటు చేసుకుంటున్నాయి. తిరుపతిలో నీటి ట్యాంక్ పైకి వచ్చిన ఘటనను ఆ జిల్లా వాసులు ఇంకా మర్చిపోలేదు. ఇటీవల పూతలపట్టు మండలం తుంబావరి పల్లెలో భూమి కంపిస్తోంది. రామకుప్పం మండల పరిధిలోని గడ్డురు, గెరిగిపల్లె, యనాది కాలనీ, కృష్ణ నగర్, గొరివిమాకుల పల్లి గ్రామాల్లో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. శుక్రవారం (నవంబర్ 26) భూమి స్వల్పంగా కంపించింది.

గత నెలలో భూమి నాలుగు సార్లు కంపించింది. భూకంపం భయంతో జిల్లా ప్రజలు ఇళ్లల్లో నుంచి రోడ్ల మీదకు పరుగులు పెడుతున్నారు. జనమంతా రోడ్ల మీదే జాగారం చేస్తున్నారు. పలు చోట్ల ఇళ్ల గోడలకు చీలికలు ఏర్పడ్డాయి. భారీ శబ్దంతో ఇళ్లలోని వస్తువులు కిందపడి పోయాయి.

English summary
3.5 Richter quake occurred 50 km west-northwest of Vellore and Chithoor too felt it.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X