Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కలకలం: తుపాకీ చూపి కారు చోరీ, ఉగ్రవాదులేనా?

పఠాన్‌కోట్‌: పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌లో మళ్లీ కలకలం రేగింది. సుజన్‌పూర్‌ ప్రాంతంలో ఆయుధాలతో వచ్చిన ముగ్గురు వ్యక్తులు బుధవారం ఓ స్థానికుడి కారును అపహరించారు. దీంతో మరోసారి ఉగ్రవాదులు చొరబడ్డారేమోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

పఠాన్‌కోట్‌ ఎయిర్‌బేస్‌పై ఈ ఏడాది జనవరిలో ఉగ్ర దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఏడుగురు జవాన్లు మృతి చెందగా, భద్రతా దళాల కాల్పుల్లో ఆరుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. అయితే, ఈ ఘటనకు ముందు కూడా కొందరు ఉగ్రవాదులు ఓ పోలీస్‌ అధికారి కారును దొంగలించిన విషయం తెలిసిందే.

3 armed men steal civilian's car at gunpoint in Pathankot

తాజా ఘటనలో పఠాన్‌కోట్‌-జమ్ము హైవేలో వెళ్తున్న కారును ముగ్గురు వ్యక్తులు అడ్డుకున్నారు. పెట్రోల్ కావాలని అడిగి.. తర్వాత నాటు తుపాకీలతో కారు యజమానిని బెదిరించి కారును ఎత్తుకెళ్లినట్లు పోలీసులు వెల్లడించారు.

ఇది ఉగ్రవాద ఘటన కాదని తెలిపారు. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రాంతంలో భద్రతను పటిష్ఠం చేశామని వెల్లడించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+