కాల్ సెంటర్ ఉద్యోగిని కిడ్నాప్ చేసి చంపారు

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో సంచలనం సృష్టించిన కాల్‌సెంటర్‌ ఎగ్జిక్యూటివ్‌ జిగీశ ఘోష్‌ ఘోష్‌ హత్య కేసులో కోర్టు ముగ్గురు నిందితులనూ దోషులుగా నిర్ధారించింది. వారికి శిక్షను ఖరారు చేయాల్సి ఉంది. 2009లో ఢిల్లీ సమీపంలోని నోయిడాలో కాల్‌సెంటర్‌ ఉద్యోగిని జిగీశ ఘోష్‌ను దోపిడీ చేసి హత్య చేసిన విషయం తెలిసిందే.

ఈ కేసులో రవికుమార్‌, అమిత్‌ శుక్లా, బల్జీత్‌ సింగ్‌ మలికాలను కోర్టు దోషులుగా నిర్ధారించింది.ఈ ముగ్గురు కూడా ఢిల్లీలో జరిగిన టీవీ ఎగ్జిక్యూటివ్‌ సౌమ్యా విశ్వనాథన్‌ హత్య కేసులోనూ నిందితులుగా ఉన్నారు. కాల్‌ సెంటర్‌ ఉద్యోగిని అయిన జిగీశను రాత్రి విధులు ముగిసిన తర్వాత ఆఫీసు కారు నోయిడాలోని కార్యాలయం నుంచి దక్షిణ ఢిల్లీలోని ఆమె అపార్ట్‌మెంట్‌ కాంప్లెక్స్‌ గేట్‌ ముందు దింపింది.

వెంటనే కొందరు దుండగులు ఆమెను తుపాకీతో బెదిరించి కారులో ఎక్కించుకుని ఢిల్లీ శివారుల్లోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. ఆమె వద్ద నుంచి ఏటీఎం కార్డు లాక్కొని పిన్‌ నెంబరు తెలుసుకున్నారు. తర్వాత ఆమెను చంపేసి చెట్ల పొదల్లో పడేసి వెళ్లారు.

3 Convicted For Killing Jigisha Ghosh After Call Centre Cab Drove Away

ఏటీఎం నుంచి డబ్బు డ్రా చేసుకుని దక్షిణ ఢిల్లీ మార్కెట్లో షూ, వాచ్‌లు కొనుక్కున్నారు. నిందితులను ఏటీఎం సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా పోలీసులు పట్టుకున్నారు. ఆమెను కిడ్నాప్ చేసి చంపిన విషయం కొన్ని రోజుల తర్వాత గానీ తెలియలేదు. ఆమె మృతదేహం సూరజ్‌కుండ్‌లో లభించింది..

ఆమె మొబైల్ ఫోన్లలో నిందితులు ఒక్క దాన్ని తాము వెళ్తున్న ట్రాక్‌లో, మరోదాన్ని రోడ్డుపై పడేశారు. జిగీషా హత్యకు వాడిన ఆయుధాలను పోలీసులు కనిపెట్టారు. దీంతో ఈ హత్య మిస్టరీయే కాకుండా 2009 సెప్టెంబర్ 30వ తేదీన జరిగన మహిళా జర్నలిస్టు సౌమ్య విశ్వనాథన్ హత్య కేసు మిస్టరీ కూడా వీడింది. దోపిడీ చేసే ఉద్దేశంతోనే వారిద్దరిని నిందితులు హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Three men have been found guilty of robbing and murdering call centre executive Jigisha Ghosh in 2009 in Delhi. The same men are charged separately with shooting a young TV executive in the capital.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి