ఒకే ఫ్యామిలీలో ముగ్గురి హత్య: కప్‌బోర్డ్‌లో శవం

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం ఉదయం దారుణ ఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబంలోని ముగ్గురు హత్యకు గురయ్యారు. ఓ మృతదేహం కప్‌బోర్డులో కుక్కిపెట్టి ఉండటం గమనార్హం.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సంజీవ్‌ అనే వ్యక్తి భార్య జ్యోతి, కుమారుడు పవన్‌తో ఓల్డ్‌ రాజేంద్రనగర్‌లో నివసిస్తున్నాడు. ఆదివారం ఉదయం 9 గంటల ప్రాంతంలో సంజీవ్‌ ఇంటి తలుపులు తెరిచి ఉండటం గమనించిన ఇంటి పనిమనిషి లోపలికి వెళ్లి చూసేసరికి యజమానురాలు, ఆమె కుమారుడు నిర్జీవంగా పడి ఉన్నారు.

3 Of Family Murdered In West Delhi, 1 Body Found In Cupboard

తీవ్ర భయాందోళనలకు గురైన మనిషి.. వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు పరిశీలించగా సంజీవ్‌ మృతదేహం కప్‌బోర్డులో లభ్యమైంది. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.

బంధువులే ఆస్తి కోసం ఈ హత్యలకు పాల్పడి ఉంటారా? అనే కోణంలో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ హత్యల ఘటనలో ఎంతమంది పాల్గొన్నారనే విషయం తెలియరాలేదని, దర్యాప్తు జరుపుతున్నామని జాయింట్ కమిషనర్ ఎస్ గౌతమ్ తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+