జైల్లో శశికళ ఆశీర్వాదం తీసుకున్న మంత్రులు: ఏం మాట్లాడారు !
అయితే శశికలను కలవడానికి పరప్పన అగ్రహార జైలు అధికారులు నిరాకరించారు. శశికళను కలవడానికి అవకాశం చిక్కకపోవడంతో వారు అక్కడి నుంచి నిరాశగా వెళ్లిపోయారు.
బెంగళూరు: బెంగళూరు నగర శివార్లోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళను తమిళనాడుకు చెందిన ముగ్గురు మంత్రులు మంగళవారం కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు.

తమిళనాడు మంత్రులు సెంగోట్టియన్, సెలూర్ రాజు మరో మంత్రి మంగళవారం పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు చేరుకుని చిన్నమ్మ శశికళను కలిసి అనేక విషయాల గురించి చర్చించారని సమాచారం. అదే సమయంలో మంత్రులతో పాటు న్యాయవాదులు శశికళను కలిశారు.
జైలు నుంచి బయటకు వచ్చిన మంత్రులు, న్యాయవాదులు మీడియాతో మాట్లాడటానికి నిరాకరించారు. అక్కడి నుంచి మంత్రులు వారి వాహనాల్లో హోసూరు వైపు వెళ్లిపోయారు. శశికళను చూడటానికి తమిళనాడు నుంచి ఆమె అనుచరులు జైలు దగ్గరకు వచ్చారు.
తమిళనాడు మంత్రులు సెంగోట్టియన్, సెలూర్ రాజు మరో మంత్రి మంగళవారం పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు చేరుకుని చిన్నమ్మ శశికళను కలిసి ఆశీర్వాదం తీసుకుని అనేక విషయాల గురించి చర్చించారని సమాచారం. అదే సమయంలో మంత్రులతో పాటు న్యాయవాదులు శశికళను కలిశారు.












Click it and Unblock the Notifications