పహల్గామ్ ఉగ్రవాదుల తిక్క కుదిరింది..!!
LoC Kashmir: భారత్- పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. రెండు దేశాల జవాన్లు ఎదురు కాల్పులకు దిగారు. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తరువాత కాశ్మీర్ సమీపంలో నియంత్రణ రేఖ పొడవునా ఈ ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ విషయాన్ని భారత ఆర్మీ అధికారులు ధృవీకరించారు.
ఈ నెల 25-26 తేదీ రాత్రి వేళ కాశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వెంబడి వివిధ పాకిస్తాన్ ఆర్మీ పోస్టులు.. ఎటువంటి కవ్వింపు లేకుండా తేలికపాటి కాల్పులు జరిపాయని ఆర్మీ అధికారులు అధికారికంగా ప్రకటించారు. దీనితో సరిహద్దు భద్రత దళాలు తక్షణమే ఎదురుదాడికి దిగాయని, ఈ కాల్పులను తిప్పి కొట్టాయని చెప్పారు. ఈ కాల్పుల్లో ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదని తెలిపారు.

తాజాగా ఎటువంటి కవ్వింపు చర్యలు లేకుండా ఒక్కసారిగా నియంత్రణ రేఖ పొడువనా ఉన్న భారత్ అవుట్ పోస్టులపై పాకిస్తాన్ సైనికులు కాల్పులు జరపడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ కాల్పులు ఏ ఒక్క సెక్టార్‌కో పరిమితం కాలేదు. ఎల్ఓసీ పొడవునా కొనసాగాయి. కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్తాన్ ఉల్లంఘించినట్టయింది.
తేలికపాటి కాల్పులే అయినప్పటికీ- పహల్గామ్ ఉగ్రవాదుల దాడి అనంతరం ఈ రెండు దేశాల మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకోవడం అసాధారణంగా భావిస్తోన్నారు. ఇది- ఇక్కడితో పరిమితం కాకపోవచ్చని, భారత ఆర్మీ ఓ అడుగు ముందుకు వేయవచ్చని అంటున్నారు.
అదే సమయంలో- పహల్గామ్‌లో పర్యాటకులపై కాల్పులకు తెగబడ్డ ఉగ్రవాదుల్లో ముగ్గురి నివాసాలను బాంబులతో పేల్చివేశారు. కాశ్మీరీ ముస్లిం ఉగ్రవాదులకు చెందిన మరో రెండు నివాసాలు ధ్వంసం అయ్యాయి. కాశ్మీర్ దక్షిణ ప్రాంతం పుల్వామా సమీపంలోని ముర్రాన్‌లో ఎహసాన్ ఉల్ హక్ షేక్ బాంబులతో పేల్చివేశారు.
పుల్వామాలోని కాచిపోరా ప్రాంతంలో జరిగిన పేలుడులో లష్కరే తొయిబా ఉగ్రవాది హరిస్ అహ్మద్ ఇల్లు పూర్తిగా ధ్వంసం అయింది. నేలమట్టం అయింది. ఛోటీపొరాలో మరో ఉగ్రవాది ఇంటిని నామరూపాల్లేకుండా చేశారు. శుక్రవారం రాత్రి గంట వ్యవధిలో ఈ ముగ్గురు ఉగ్రవాదుల నివాసాలు.. బాంబు పేలుళ్ల ధాటికి గురయ్యాయి. పూర్తిగా ధ్వంసం అయ్యాయి.












Click it and Unblock the Notifications