గోరక్షణ పేరుతో కర్రలతో దాడులు, జై శ్రీరాం అనాలని బెదిరింపు : ఎంపీలో ఘటన, ఒకరి అరెస్ట్

భోపాల్ : ఎన్నికలు ముగిసాయ .. ఫలితాలు వచ్చాయి ... మళ్లీ గో రక్షణ పేరుతో దాడులు జరుగుతున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్‌లో గో రక్షకుల పేరుతో దాడికి తెగబడ్డారు కొందరు. తామే గో రక్షకులను స్వయంగా ప్రకటించుకొని ముగ్గురు ముస్లింలను చితక్కొట్టారు. అందులో ఒక మహిళ కూడా ఉండటం ఆందోళన కలిగిస్తోంది.

కర్రలతో దాడి .. వీడియో వైరల్
మధ్యప్రదేశ్‌లోని సియోని జిల్లాకు చెందిన ముగ్గురు తమ ఆటోలో ప్రయాణిస్తున్నారు. వీరిలో ఒక మహిళ ఉన్నారు. అయితే వారు బీఫ్ తరలిస్తున్నారని గో రక్షకులకు తెలిసింది. వెంటనే ఆటోను ఆపారు. బీఫ్ సరఫరా చేస్తారా అని కర్రలతో దాడికి తెగబడ్డారు. వారి దాడిచేసిన వీడియో సోషల్ మీడియాలో పోస్టవడంతో వైరలైంది. అంతేకాదు వారిని జై శ్రీరాం అనాలని హుంకరించారు. వారు అందుకు స్పందించకపోవడంతో తమ కర్రలతో ప్రతాపం చూపియించారు. అక్కడున్న మహిళను జై శ్రీరాం అనాలని కర్రలతో బెదిరించారు.

3 Muslims thrashed by gau rakshaks, made to shout Jai Shree Ram slogans

ఒకరి అరెస్ట్ ..
మధ్యప్రదేశ్‌లో జరిగిన ఈ ఘటనపై పోలీసులు స్పందించారు. కేసు నమోదు చేసినట్టు వివరించారు. ఇప్పటికే ఒకరిని అదుపులోకి తీసుకున్నామని .. మిగతా వారి కోసం గాలిస్తున్నామని పేర్కొన్నారు. ఈ ఘటనపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. 'మోదీని గెలిపించిన ఓటర్లు అమాయక ముస్లింలపై దాడికి ఇదే ఉదహరణ, మరోసారి తమ నైజాన్ని వారు ప్రదర్శించారు' అని మండిపడ్డారు.

3 Muslims thrashed by gau rakshaks, made to shout Jai Shree Ram slogans
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+