5లో 3 కేసులు సెక్సువల్ కాంటాక్ట్.. 2 కేసులు నో: మంకీపాక్స్‌పై ఐసీఎంఆర్ అధ్యయనం
మంకీపాక్స్ కేసులు ఆందోళనకు గురిచేస్తోంది. అయితే ఐసీఎంఆర్ వీటిపై అధ్యయనం చేయగా విస్తుగొలిపే విషయం బయటకు వచ్చింది. మంకీపాక్స్.. లైంగిక సంపర్కం, లేదంటే గాయం ద్వారా వస్తోందని చెప్పేవారు. అయితే 5 కేసుల్లో.. 3 కేసులు మాత్రమే భిన్న లైంగిక సంపర్కం ద్వారా సోకిందనే విషయం తెలిసింది. మరో రెండు మాత్రం అలాంటిదేమీ లేదని వివరించింది. దీంతో ఆ రెండు కేసుల వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది.
రెండు కేసులు మాత్రం సెక్సువల్ కాంటాక్ట్ లేదని పుణే నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ తెలిపింది. 2,3, 5 కేసులు డ్రగ్స్, మద్యం ప్రభావంతో కాకుండా సింప్టమ్స్ ప్రారంభమైన 2 రోజులలోపు భిన్న సంపర్కుల చరిత్రను కనుగొన్నారు. 1,4 కేసులు లైంగిక సంబంధాలు లేవని వివరించింది. వీటిలో ఏదీ బై సెక్సువల్, హోమో సెక్సువల్ చూపలేదని తెలిపింది.

అంతేకాదు ఇంటర్నేషనల్ ట్రావెల్ లేని కేసులని తెలిపారు. ఐదు కేసులు ఇక్కడే డెవలప్ అయ్యాయని వివరించారు. 3 కేసుల్లో పురుషులు పురుషుల సెక్స్, మహిళా సెక్స్ వర్కర్ల ద్వారా సోకిందని అధ్యయనం తెలిపింది. నివేదిక ప్రకారం.. అంటువ్యాధులు ప్రబలలేదని పేర్కొంది.
మంకీపాక్స్ వ్యాధికి సంబంధించి ఇంగ్లాండ్ పరిశోధకుల అధ్యయనంలో షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి. మంకీపాక్స్ వ్యాధి సోకిన వ్యక్తుల్లో 98 శాతం మంది గే లేదా బైసెక్సువల్ పురుషులేనని వెల్లడైంది. పురుషులతో పురుషులకు లైంగిక సంబంధాలే మంకీపాక్స్ వ్యాధి వ్యాప్తికి కారణమై ఉండొచ్చునని పేర్కొంది. 16 దేశాల్లో 528 మంకీపాక్స్ కేసులను విశ్లేషించిన పరిశోధకులు ఈ అంచనాకు వచ్చారు. దీనిపై జూలై 21న '16 దేశాల్లో మంకీపాక్స్ వైరస్ ఇన్ఫెక్షన్-ఏప్రిల్-జూన్ 2022' పేరుతో ఇంగ్లాండ్‌లో ఒక జర్నల్ ప్రచురితమైన సంగతి తెలిసిందే.












Click it and Unblock the Notifications