మళ్లీ తెగబడ్డ పాక్.. ముగ్గురు సైనికులను పొట్టనబెట్టుకున్న ఉగ్రవాదులు
మంగళవారం ఉదయం నుంచి కశ్మీర్ నియంత్రణ రేఖ వెంబడి భారత సైన్యానికి పాక్ ఉగ్రవాదులకు మధ్య జరుగుతున్న కాల్పుల్లో.. ముగ్గురు భారత సైనికులు మరణించారు.
మచల్ : పాక్‌పై భారత సర్జికల్ స్ట్రైక్స్ తర్వాత.. తొలిసారిగా భారత సైన్యానికి ఎదురుదెబ్బ తగలింది. మంగళవారం ఉదయం నుంచి కశ్మీర్ నియంత్రణ రేఖ వెంబడి భారత సైన్యానికి పాక్ ఉగ్రవాదులకు మధ్య జరుగుతున్న కాల్పుల్లో.. ముగ్గురు భారత సైనికులు మరణించారు. వీరిలో ఒక సైనికుడి మృతదేహాన్ని ముక్కలుగా చేసి తమ క్రూరత్వాన్ని బయటపెట్టుకున్నారు పాక్ ఉగ్రవాదులు.

మచల్ సెక్టార్ వద్ద ఈ ఘోరం చోటు చేసుకుంది. కాగా, దీనికి తీవ్రమైన ప్రతీకారం తప్పదని భారత ఆర్మీ పాక్ ను హెచ్చరించింది. సైనికుల మృతదేహాలను పాక్ ముక్కలుగా చేయడం ఈ ఏడాది ఇది రెండోసారి కావడం గమనార్హం. గతంలో కాంగ్రెస్ హయాంలోను ఓ సైనికుడి తలను నరికి పాక్ ఉగ్రవాదులు తమ క్రూరత్వాన్ని బయటపెట్టుకున్నారు. ఏదేమైనా మరోసారి కాల్పుల విరమణ ఒప్పందానికి పాల్పడి నియంత్రణ రేఖ వెంబడి అలజడి సృష్టించే ప్రయత్నం చేశారు పాక్ ఉగ్రవాదులు.












Click it and Unblock the Notifications