
ముగ్గురి అరెస్ట్: పాక్ సిమ్ కార్డ్స్, ఏకె47లు స్వాధీనం
పఠాన్‌కోట్: పంజాబ్‌లోని మొహాలీలో ఉగ్రవాదులుగా అనుమానిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి పాకిస్థాన్‌కు చెందిన సిమ్ కార్డులు, పాకిస్థాన్‌లో తయారుచేసిన ఆటోమాటిక్ రైఫిల్స్, ఇతర ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
ముగ్గురు వ్యక్తులను పోలీసులు హెరాయిన్ స్మగ్లర్లుగా భావిస్తున్నారు. పంజాబ్‌లోని పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై దాడి చేసిన ఉగ్రవాదుల కోసం పోలీసులు ఇంకా గాలిస్తున్న నేపథ్యంలో మొహాలీలో ఇలా అనుమానాస్పదంగా ముగ్గురు వ్యక్తులు అరెస్టు కావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.

ఎయిర్‌బేస్‌పై దాడికి పాల్పడిన ఉగ్రవాదులు పాక్ నుంచే వచ్చినట్లు అధికారులు భావిస్తున్న సంగతి తెలిసిందే. కాగా, మొహాలీలో అరెస్టయిన వ్యక్తులకు ఉగ్రవాదులతో సంబంధం లేదని సీనియర్ పోలీసు అధికారి జీపీఎస్ భుల్లార్ వెల్లడించారు.
పాకిస్థాన్‌తో చర్చలపై కేంద్రం తర్జనాభర్జనలు
దాయాది పాకిస్థాన్‌తో చర్చలపై కేంద్ర ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది. పఠాన్‌కోట్‌పై ఉగ్రదాడి నేపథ్యంలో జనవరి 15న ఇస్లామాబాద్‌లో జరగాల్సిన చర్చలపై సందిగ్ధం ఏర్పడింది. భారత, పాక్ విదేశాంగ కార్యదర్శుల చర్చలు నిలిపివేసే దిశగా కేంద్రం అడుగులు వేస్తున్నట్లు సమాచారం.