లోయలో పడిపోయిన బస్సు..30 మంది మృతి..!!
ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. 35 నుంచి 40 మంది ప్రయాణికులతో వెళుతున్న బస్సు అల్మోరా జిల్లా మార్చులాలో అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 36 మంది చనిపోయినట్లు తెలుస్తోంది.మరో ఐదుగురి జాడ దొరకలేదు. ప్రమాదం జరిగిన తీరును అల్మోరా జిల్లా విపత్తు నిర్వహణాధికారి వినీత్ పాల్ వివరించారు.ఇప్పటి వరకు 20 మృతదేహాలు వెలికి తీసినట్లు వినీత్ పాల్ చెప్పారు.చాలామందికి తీవ్రగాయాలయ్యాయని వెల్లడించారు.గాయపడిన వారిని హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.
ప్రమాదం చోటుచేసుకున్న ప్రాంతంలో స్థానిక గ్రామస్తులు వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు.ఇంకా బస్సు కిందే నలిగిన కొందరిని రక్షించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.గర్హ్వాల్ జిల్లాలోని నైని దండా నుంచి నైనితాల్ జిల్లాలోని రాంనగర్‌కు వెళుతుండగా సోమవారం ఉదయం 7 గంటలకు సరాద్ బెండ్ ప్రాంతానికి చేరుకోగానే బస్సు అదుపు తప్పి లోయలో పడింది.

ప్రమాదం జరిగిందన్న సమాచారం అందడంతో ఎస్డీఆర్ఎఫ్, స్థానిక పోలీసులు, మెడికల్ టీమ్స్ ఘటనా స్థలానికి చేరుకున్నాయి.బస్సు లోయలోకి పడిపోగానే అందులోని కొందరు ప్రయాణికులు బస్సు పైకి ఎక్కి ప్రాణాలను దక్కించుకున్నారు. ఆ ప్రయాణికులే పోలీసులకు సమాచారం ఇచ్చారు.అయితే బస్సులో ఏదైనా సాంకేతిక లోపం తలెత్తడంతో ప్రమాదం జరిగిందా లేద మానవ తప్పిదమేనా అనేదానిపై విచారణ జరుగుతోంది.

ఇదిలా ఉంటే ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ప్రమాదంపై విచారం వ్యక్తం చేశారు.వెంటనే సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడారు. మృతుల కుటుంబాలకు తన సానుభూతిని తెలిపారు.












Click it and Unblock the Notifications