యువతిపై తండ్రి, అన్నలతో పాటు 30 మంది రేప్
చెన్నై: తమిళనాడు రాష్ట్రంలో అత్యంత దిగ్భ్రాంతికరమైన, అమానుషమైన సంఘటన వెలుగు చూసింది. తండ్రి, అన్నలే కాకుండా రక్షించాలని పోలీసు ఆఫీసరుతో పాటు 30 మంది ఓ యువతి దేహంపై విరుచుకుపడ్డారు. తల్లి లేని పిల్ల అని కూడా చూడకుండా తండ్రే కామాంధులను తన కూతురిపైకి రెచ్చగొట్టాడు.
అమ్మాయి తండ్రి, అన్నల స్నేహితులు ఆమెపై కామంతో విరుచుకుపడ్డారు. వారిపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన పోలీసు ఇన్‌స్పెక్టర్ కూడా ఆమెను వదల్లేదు. ఆరకంగా 30 మంది ఆ అమ్మాయిపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయాలను బాధితురాలు జుడీషియల్ మెజిస్ట్రేట్‌కు గురువారం తెలిపింది. ఆ ఘటన తమిళనాడులోని శివగంగ జిల్లాలో జరిగింది.

ఆరోగ్యనగర్‌కు చెందిన ముత్తుపాండి (50)కి కొంత కాలం క్రితం భార్య చనిపోయింది. అతనికి కార్తీక్ (23) అనే కుమారుడు, పదిహేడేళ్ల కూతురు ఉన్నారు. అయితే ఆమెపై తండ్రి, అన్నలే అత్యాచారానికి పాల్పడ్డారంటూ ఆమె బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారిద్దరితో పాటు మరో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. దీనిపై మద్రాసు హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది.
దీన్ని విచారణకు స్వీకరించిన హైకోర్టు చీఫ్ జస్టిస్ సంజయ్‌కిషన్ కౌల్ ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేయాలని జ్యుడీషియల్ మెజిస్ట్రేట్‌ను ఆదేశించారు. తన తండ్రి, అన్నలతో పాటు వారి స్నేహితులు, రవాణాశాఖకు చెందిన కొందరు అధికారులు కలిపి సుమారు 30 మంది అత్యాచారం చేశారని ఆమె మెజిస్ట్రేట్‌కు తెలిపింది.
ఫిర్యాదు చేసేందుకు పోలీస్‌స్టేషన్‌కు వెళితే అక్కడ ఇన్‌స్పెక్టర్ శివకుమార్, ఎస్సై శంకర్‌లు స్టేషన్‌లోనే తనను చెరిచారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్న శివగంగ జిల్లా ఏఎస్పీ నందితా పాండే గురువారం శివకుమార్‌ను విచారించి, విధుల నుంచి తప్పించి, అరెస్టు చేశారు. ఆమెను చెన్నైలోని బాలికల సంరక్షణా కేంద్రానికి తరలించారు. అధికారులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications