మహా కుంభమేళా తొక్కిసలాటలో మృతులపై అధికారిక ప్రకటన ఇదే

ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన తొక్కిసలాలో 30 మంది ప్రాణాలు కోల్పోయినట్లు మహాకుంభ్ డీఐజీ వైభవ్ కృష్ణ తెలిపారు. తొక్కిసలాట ఘటనకు సంబంధించి వివరాలను డీఐజీ బుధవారం సాయంత్రం మీడియాకు వెల్లడించారు. అర్ధరాత్రి 1-2 గంటల మధ్య ఒకటిరెండు చోట్ల తొక్కిసలాట జరిగిందన్నారు. బారికేడ్లు ధ్వంసం కావడం వల్లే ప్రమాదం జరిగిందని తెలిపారు.

మృతుల్లో 25 మంది ఆచూకీ గుర్తించామని తెలిపిన డీఐజీ.. మరో ఐదుగురిని గుర్తించాల్సి ఉందన్నారు. తొక్కిసలా ఘటనలో 60 మంది గాయపడ్డారని తెలిపారు. క్షతగాత్రులు స్థానిక ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని చెప్పారు. వీరిలో చాలా మంది పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు.

30 people killed in Maha Kumbh Mela stampede DIG

బుధవారం రోజున కుంభమేళాకు వీఐపీలను ఎవరినీ అనుమతించలేదని వెల్లడించారు. ప్రయాగ్‌రాజ్‌లో ప్రస్తుతం సాధారణ పరిస్థితి నెలకొందన్నారు. సమాచారం కోసం హెల్ప్ లైన్ నెంబర్ 1920ను సంప్రదించాలని డీఐజీ వైభవ్ కృష్ణ సూచించారు.

కాగా, బుధవారం మౌని అమావాస్య సందర్భంగా ప్రయాగ్‌రాజ్‌‌లో త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానాల కోసం పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. దీంతో బుధవారం తెల్లవారుజామున 1 నుంచి 2గంటల సమయంలోనే విపరీతమైన రద్దీ పెరిగిపోయింది. ఈ క్రమంలోనే పొగమంచు కారణంగా తొక్కిసలాట చోటు చేసుకుంది.

తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఘటనపై పలుమార్లు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు ఫోన్ చేసి ఆరా తీశారు ప్రధాని మోడీ. త్రివేణి సంగమం ప్రధాన ఘాట్‌లోనే స్నాణం చేయాలని ఎక్కువ మంది భక్తులు రావొద్దని.. ఇతర ఘాట్ల వద్ద కూడా స్నానాలు ఆచరించవచ్చని భక్తులకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ విజ్ఞప్తి చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+