విషాదయాత్ర: మహారాష్ట్రలో లోయలో పడ్డ బస్సు...23 మంది మృతి
మహారాష్ట్ర: మహారాష్ట్రలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. రాయగఢ్ జిల్లాలోని అమ్‌బెనాలీ ఘాట్ ప్రాంతంలో ఉన్న లోయలోకి బస్సు ప్రమాదవశాత్తు పడిపోయింది. ఈ ఘటనలో 33 మంది చనిపోయినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణిస్తున్నారు. వీరంతా దపోలి అగ్రికల్చరల్ యూనివర్శిటీకి చెందిన సిబ్బందిగా అధికారులు గుర్తించారు. వీరంతా మహాబలేశ్వర్‌కు విహారయాత్రకు వెళుతుండగా ప్రమాదం చోటుచేసుకుంది.

సమాచారం అందుకున్న వెంటనే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బస్సులో ప్రయాణిస్తున్న ప్రకాష్ రాజారామ్ అనే ప్రయాణికుడు ఆ బస్సులోనుంచి బయటకు దూకి ప్రాణాలతో బయటపడ్డాడు. జూలై 19న ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని తేరి జిల్లాలో ఇదే తరహా ప్రమాదం జరగడంతో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ ఘటన మరవక ముందే మరో మహారాష్ట్రలో మరో ప్రమాదం జరిగింది.













Click it and Unblock the Notifications