దసరా విషాదం: తొక్కిసలాటలో 33 మంది మృతి
పాట్నా: దసరా పర్వదినం సందర్భంగా అత్యంత విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. బీహార్‌లోని పాట్నా గాంధీ మైదానంలో నిర్వహించిన రావణ దహనం కార్యక్రమంలో జరిగిన ప్రమాదంలో 33 మంది మృత్యువాత పడ్డారు. కార్యక్రమం ముగిసిన తర్వాత తిరిగి వెళ్తుండగా తొక్కిసలాట జరిగింది.
మృతుల్లో ఆరుగురు చిన్నారులు కూడా ఉన్నారు. మహిళలు కూడా ఉన్నారు.గాయపడినవారిలో 15 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఈ కార్యక్రమానికి లక్షల మంది హాజరయ్యారు. పెద్ద శబ్దంతో ఎలక్ట్రిక్ పోల్ పడిపోవడంతో బాంబు పేలిందనే భయాందోళనలకు ప్రజలు గురయ్యారు.

రావణుడు, కుంభకర్ణుడు, మేఘనాథుల దిష్టిబొమ్మలను దగ్ధం చేసిన తర్వాత ఎలక్ట్రిక్ పోల్ పడిపోవడంతో మేలాలో చీకిటి అలుముకుంది. గాయపడినవారిని ఆస్పత్రులకు తరలించారు. తొక్కిసలాట శుక్రవారం సాయంత్రం ఆరున్నర గంటల ప్రాంతంలో జరిగింది. అందరూ తిరిగి ఇళ్లకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
వంద మందికిపైగా గాయపడ్డారని, 33 మంది మరణించారని, 26 మంది పిఎంసిహెచ్‌లోని ఎమర్జెన్సీ వార్డులో ఉన్నారని హోం శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి అమీర్ సుభానీ చెప్పారు. ఎంత మంది గాయపడ్డారనేది ఇంకా లెక్క తేలలేదు.












Click it and Unblock the Notifications