వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వలస కార్మికుల కోసం 330 కోట్ల కేంద్ర నిధులు.!బండి సంజయ్ ప్రశ్నకు లిఖితపూర్వక జవాబు.!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : కరోనా వేళ ఆత్మనిర్భర్ భారత్ రోజ్ గార్ యోజన కింద తెలంగాణలోని 1.84 లక్షల మంది వలస కార్మికులకు ప్రయోజనం చేకూరుస్తూ 102.66 కోట్లు, ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద1.73 లక్షల వలస కార్మికులకు ప్రయోజనం చేకూరుస్తూ 102.69 కోట్లు కేంద్రం వెచ్చించిందని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ తేలి స్పష్టం చేశారు. దీనికి అదనంగా భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు రూ.124.55 కోట్లు విడుదల చేసిందని, దీనివల్ల 8.30 లక్షల భవన నిర్మాణ కార్మికులు లబ్ధి పొందారని చెప్పారు. ఇవాళ బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ తెలంగాణలోని వలస కార్మికుల సంక్షేమం కోసం కేంద్ర ఖర్చు చేసిన నిధులపై పార్లమెంటులో అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి రాతపూర్వక సమాధానం ఇచ్చారు.
వలస కార్మికుల కోసం మోదీ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని, కరోనా విపత్తు కాలంలో అదనంగా మరిన్ని చర్యలు చేపట్టిందని ఈ సమాధానంలో మంత్రి తెలిపారు.

330 crore central funding for migrant workers!Written answer to Bandi Sanjay question.!

కరోనా వేళ ఆత్మనిర్భర్ భారత్ రోజ్ గార్ యోజన కింద దేశవ్యాప్తంగా 39.51 లక్షల ఉద్యోగాల కల్పన జరిగిందన్నారు. తత్ఫలితంగా ఈపీఎఫ్ ఖాతాల్లో అదనంగా రూ.2583 కోట్లు జమయ్యాయని తెలిపారు. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద 38.91 లక్షల మంది చిరు ఉద్యోగులకు రూ.2567 కోట్లు ప్రయోజనం చేకూర్చామన్నారు. భవన నిర్మాణ, ఇతర కార్మికుల కోసం రూ.7413 కోట్ల సాయం అందించామని మంత్రి తెలిపారు. అటల్ బీమిత్ వ్యక్తి కళ్యాణ్ యోజన, ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ రోజ్ గార్ అభియాన్ కింద 50.78 కోట్ల మానవ పనిదినాలు సృష్టించామన్నారు. దీనికి రూ.39,293 కోట్ల ఖర్చు చేశామన్నారు. ఇంకా పీఎంస్వనిధి కింద రుణాలు, ప్రతి వ్యక్తికి అదనంగా నెలకు 5 కిలోల ఆహార ధాన్యాలు ఉచితంగా అందించామన్నారు. ఇందులో భాగంగా తెలంగాణలోని వలస కార్మికుల కోసం ఆత్మనిర్భర్ భారత్ రోజ్ గార్ యోజన కింద రూ.102.66 కోట్లు, ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద రూ.102.69 కోట్లు, భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు ద్వారా రూ.124.55 కోట్లు కలిపి మొత్తం రూ.329.90 కోట్లు కేంద్రం వెచ్చించిందని మంత్రి రామేశ్వర్ తేలి తెలిపారు.

English summary
The Union Minister was responding in writing to a question by BJP state president and Karimnagar MP Bandi Sanjay Kumar in Parliament on the funds spent by the Center for the welfare of migrant workers in Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X