Maha kumbhmela 2025: "కుంభమేళాలో 34 కోట్లమంది భక్తుల స్నానాలు"

ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం మహా కుంభమేళా.ప్రతిరోజూ లక్షల మంది భక్తులు దేశవిదేశాల నుంచి వస్తున్నారు. గంగా- యమునా- సరస్వతి నదుల త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. దీంతో అక్కడ ఇసుకేస్తే రాలనంత జనసందోహం నెలకొంది. అయితే తాజాగా యోగి ప్రభుత్వం భక్తుల వివరాలను వెల్లడించింది.

యూపీలోని మిల్కిపుర్ అసెంబ్లీ నియోజకవర్గంలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న సీఎం యోగి ఆదిత్యనాథ్.. ఇప్పటివరకు మహాకుంభమేళాలో 34 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారని తెలిపారు. భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందని.. అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. భక్తులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా పటిష్ట భద్రత అందిస్తున్నట్లు పేర్కొన్నారు.

34 Crore Devotees Attend Mahakumbh Mela in Prayagraj Says UP CM Yogi Adityanath

"అయోధ్యలో రామ్ లల్లా దేవాలయం ఏర్పాటైనప్పుడు సమాజ్ వాదీ పార్టీ అడ్డుకుంది. అయోధ్య ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు మహార్షి వాల్మికీ పేరు పెట్టినప్పుడు అడ్డుకుంది. గత రెండునెలలుగా ఎస్పీ చీఫ్ ట్వీట్లు అన్నీ మహాకుంభమేళాకు వ్యతిరేకంగానే ఉన్నాయి.ఇప్పటివరకూ మహాకుంభమేళాలో 34కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. ఇది చారిత్రక ఘట్టం." అని యోగి ఆదిత్యనాథ్ తెలిపారు.

ఇటీవల కుంభమేళాలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 30 మంది మృతి చెందారు. మరో 60 మంది గాయపడ్డారు. 'మౌని అమావాస్య సందర్భంగా అమృతస్నానం ఆచరించే ఉద్దేశంతో ప్రజలు భారీగా గుమిగూడారు.దీంతో తొక్కిసలాట జరిగింది. ఇక 45 రోజుల పాటు జరిగే మహాకుంభమేళా ఉత్తర్‌ప్రదేశ్‌ ఆర్థిక వ్యవస్థకు రూ.2 లక్షల కోట్ల సంపదను సమకూర్చే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. మొత్తం 40కోట్ల మంది భక్తులు వస్తారని అంచనాలు ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+