కారులో సౌండ్ సిస్టమ్ పేలి నలుగురు పిల్లలు సజీవ దహనం
ఘజియాబాద్: కారులో ఆకస్మికంగా మంటలు వ్యాపించి నలుగురు పిల్లలు సజీవదహనమైన సంఘటన ఢిల్లీ సమీపంలోని ఘజియాబాదులో జరిగింది. ఘజియాబాదులో టపాకాయల వ్యాపారం చేస్తున్న వ్యాపారి మహమ్మద్ రిజ్వాన్ ఉంటున్నారు. సోమవారం కారులో టపాకాయలు తీసుకుని వివాహ శుభకార్యం దగ్గరకు బయలుదేరారు.
కారులో అక్షా (6), ఫర్హాన్ (8), సారికా (3), ఫరాన్బి (7), కృష్ (7) తదితరులు ఉన్నారు. ఘజియాబాదులోని షహిబాబాద్ సమీపంలో వెలుతున్న సమయంలో కారులో ఏర్పాటు చేసిన సౌండ్ సిస్టమ్ ఆన్ చేశారు. ఆ సమయంలో సౌండ్ సిస్టమ్ పేలిపోయింది. దీంతో కారులో ఉన్న నలుగురు పిల్లలు సజీవదహనం అయ్యారు. తీవ్రగాయాలైన కారు డ్రైవర్, కృష్‌ను ఆసుపత్రికి తరలించారు.
కృష్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యుడు ఆర్.కే. భరద్వాజ్ తెలిపారు. వ్యాపారవేత్త రిజ్వాన్ నిభందనలకు వ్యతిరేకంగా కారులో టపాకాయలు తరలిస్తున్నాడని పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ప్రమాదంలో మహ్మద్ రిజ్వాన్ కుమారుడు, కుమార్తె మరణించారు. మహ్మద్ రిజ్వాన్‌ను అరెస్టు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

మహిళ సజీవదహనం!
ఇంటిలో ఉన్న మహిళ సజీవదహనమైన సంఘటన బెంగళూరు నగరంలోని విజ్ఞాన నగర పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. విజ్ఞాన నగరలో 35 సంవత్సరాల మహిళ ఒంటరిగా నివాసం ఉంటోంది. ఆదివారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో భోజనం చేసిన అనంతరం ఇంటి బయటకు వచ్చి నిలబడింది. ఆ సమయంలో పక్కింటి వాళ్లు చూశారు. ఆ తర్వాత అర్దరాత్రి దాటిన తరువాత మహిళ ఇంటిలో నుండి పోగలు వచ్చాయి.
సోమవారం వేకువజామున దట్టమైన పోగలు రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా మహిళ సజీవదహనమైంది. మహిళ పేరు, వివరాలు తెలియడం లేదిని పోలీసులు చెప్పారు. ఆమె సిగరేట్లు కాల్చుతుందని చట్టు పక్కల వారు పోలీసులకు చెప్పారు. మహిళను ఎవరైనా హత్య చేశారా? లేక సిగరేట్ పీక మంచం మీద పడి మంటలు వ్యాపించి మరణించిందా అని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications