విషాదం: నాగ్‌పూర్ కోవిడ్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం... నలుగురి మృతి,ఇద్దరి పరిస్థితి విషమం
మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కోవిడ్ ఐసీయూ వార్డులో మంటలు చెలరేగడంతో నలుగురు మృతి చెందారు. మరికొందరు గాయాలపాలయ్యారు. గాయపడినవారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. శుక్రవారం(ఏప్రిల్ 9) రాత్రి 8.10గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
'ఆస్పత్రి రెండో అంతస్తులో ఉన్న కోవిడ్ ఐసీయూ వార్డులోని ఏసీ యూనిట్‌లో మంటలు చెలరేగాయి. ఆ తర్వాత వార్డు మొత్తం మంటలు వ్యాపించాయి. అయితే మంటలు రెండో అంతస్తుకే పరిమితమయ్యాయి. మిగతా అంతస్తులకు వ్యాపించకపోవడంతో ప్రమాద తీవ్రత తగ్గింది.' అని నాగ్‌పూర్ మున్సిపల్ కార్పోరేషన్ చీఫ్ ఫైర్ ఆఫీసర్ రాజేంద్ర ఉచ్కే తెలిపారు.

అగ్ని ప్రమాదం గురించి తెలియగానే హుటాహుటిన ఫైరింజన్స్‌ను ఆస్పత్రి వద్దకు తరలించినట్లు రాజేంద్ర తెలిపారు. ఆస్పత్రిలోని 27 మంది పేషెంట్లను ఇతర ఆస్పత్రులకు తరలించినట్లు స్థానిక పోలీస్ అధికారి ఒకరు వెల్లడించారు.
Maharashtra: A fire broke out at a COVID hospital in Nagpur
— ANI (@ANI) April 9, 2021
"Around 27 patients at the hospital were shifted to other hospitals. We can't comment on their health condition now. Hospital has been evacuated," says police pic.twitter.com/YfGd9p4Xjh
ప్రమాదం జరిగిన ఆస్పత్రిలో మొత్తం 30 పడకలు ఉండగా... ఇందులో ఐసీయూలో 15 పడకలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. 'నాగ్‌పూర్ ప్రమాద ఘటన విచారకరం. ప్రమాదంలో మరణించినవారి కుటుంబాలకు అండగా ఉంటాం. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను.' అని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఈ ప్రమాదంపై ట్విట్టర్‌లో స్పందించారు.'నాగ్‌పూర్‌లోని ఆస్పత్రిలో అగ్నిప్రమాదం గురించి తెలిసి చాలా బాధనిపించింది. వెంటనే నాగ్‌పూర్ కలెక్టర్‌తో మాట్లాడాను.. అవసరమైన సహాయక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ప్రమాదంలో మరణించినవారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి.గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా.' అని పేర్కొన్నారు.
కాగా,ప్రస్తుతం దేశంలోనే అత్యధికంగా మహారాష్ట్రలో కరోనా కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ప్రభుత్వం నైట్ కర్ఫ్యూలు,వీకెండ్ లాక్‌డౌన్స్ కూడా విధించింది. అయినప్పటికీ పరిస్థితి నియంత్రణలోకి రాకపోవడంతో సంపూర్ణ లాక్‌డౌన్ దిశగా ఆలోచిస్తోంది.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications