వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఊహించని షాక్... కారులో ప్రత్యక్షమైన నాలుగడుగుల కొండ చిలువ...

|
Google Oneindia TeluguNews

ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాకి చెందిన ఓ కుటుంబానికి ఊహించని ఘటన ఎదురైంది. తమ కారు బానెట్‌ లోపల నాలుగు అడుగుల పొడవైన కొండచిలువ దూరడాన్ని గమనించి షాక్ తిన్నారు. వెంటనే వన్యప్రాణి సంరక్షణ విభాగానికి చెందిన ర్యాపిడ్ రెస్పాన్స్ యూనిట్‌కు సమాచారం అందించారు. దీంతో ఆ టీమ్ అక్కడికి చేరుకుని కారు బానెట్ లోపలి నుంచి కొండచిలువను బయటకు తీశారు. అనంతరం సమీపంలోని అటవీ ప్రాంతంలో దాన్ని వదిలేయడంతో ఆ కుటుంబం ఊపిరి పీల్చుకుంది. గురువారం(డిసెంబర్ 24) ఉదయం ఆగ్రాలోని ఎల్ఐసీ కాలనీలో ఈ ఘటన జరిగింది.

కారు బానెట్‌కు ఉన్న చిన్న సందు నుంచి అంత పెద్ద పాము లోపలికి దూరడంపై ఆ కుటుంబం విస్మయం వ్యక్తం చేసింది. వన్యప్రాణి సంరక్షణ విభాగాన్ని సంప్రదించగానే తక్షణం వారి టీమ్ రంగంలోకి దిగి పామును పట్టుకున్నారని తెలిపింది. ఆ టీమ్ అంత త్వరగా స్పందించి పామును పట్టుకున్నందుకు వారికి కృతజ్ఞతలు చెప్పింది.

4-Feet-Long Indian Rock Python found inside cars bonnet in agra

ఎస్ఓఓస్ వన్యప్రాణి సంస్థ డైరెక్టర్ బైజు రాజ్ ఈ ఘటనపై మాట్లాడుతూ.. ప్రస్తుతం చలికాలం కావడంతో బయట ఉష్ణోగ్రతలు తీవ్రంగా పడిపోతున్నాయని.... దీంతో పాములు జనావాసాల్లోకి వస్తున్నాయని అన్నారు. ఇలాంటి ఘటనల్లో సాయం అందించేందుకు తమ టీమ్స్ ఎప్పుడూ సిద్దంగా ఉంటాయన్నారు. ఎల్‌ఐసీ కాలనీలో పట్టుకున్న ఆ కొండచిలువను ఇండియన్ రాక్ పైథాన్‌గా గుర్తించామన్నారు. అది విషపూరితమైనది కాదని... ఎక్కువగా అడవులు,గడ్డి భూముల్లోనే అది సంచరిస్తుందని తెలిపారు. ఎలుకలు,గబ్బిలాలు,అడవి పందులు,పక్షులు తదితర జీవులను ఇది భక్షిస్తుందన్నారు. భారత్‌తో పాటు నేపాల్,పాకిస్తాన్,భూటాన్,బంగ్లాదేశ్,శ్రీలంక దేశాల్లో ఈ కొండచిలువులు ఎక్కువగా కనిపిస్తాయన్నారు.

English summary
A family from Agra had an unexpected passenger in their car on Thursday morning. A four-feet long Indian rock python stuck in the bonnet of a hatchback car was rescued by the Wildlife SOS Rapid Response Unit from L.I.C Colony here. The reptile was later released in a safe habitat.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X