Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బెంగాల్ పంచాయతీ పోరులో భారీ హింస-పోలింగ్ కు ముందే 4గురు టీఎంసీ కార్యకర్తల హత్య..

పశ్చిమబెంగాల్లో పంచాయతీ ఎన్నికలు హింసాత్మకంగా మారుతున్నాయి. ఓవైపు రాష్ట్రంలో బలంగా ఉన్నట్లు చెప్పుకుంటున్న అధికార తృణమూల్ కాంగ్రెస్ కు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. స్ధానిక ఎన్నికలు కావడంతో విపక్షాల నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకునేందుకు టీఎంసీ శ్రేణులు దాడులకు దిగుతున్నాయి. దీనిపై ఇప్పటికే విపక్షాలు గగ్గోలు పెడుతుంటే.. తాజాగా ఏకంగా నలుగురు టీఎంసీ కార్యకర్తలు వేర్వేరు ప్రాంతాల్లో హత్యకు గురయ్యారు.

పంచాయతీ ఎన్నికల పోలింగ్ కు ముందే ఈ బెంగాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో ఈ నలుగురిని ప్రత్యర్ధి పార్టీలు చంపేసినట్లు తెలుస్తోంది. మరోవైపు అధికార టీఎంసీ కార్యకర్తల దాడులపై కాంగ్రెస్, కమ్యూనిస్టులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. అధికార పార్టీ కార్యకర్తలు ఎక్కడికక్కడ రెచ్చిపోతున్నారని, తమపై దాడులకు దిగుతున్నాయని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. బెంగాల్లో ఇవాళ ఉదయం 7 గంటలకు పంచాయతీ ఎన్నికల పోలింగ్ మొదలైంది. ఇందులో గ్రామీణ ప్రాంతాల్లోని 5.6 కోట్ల మంది ప్రజలు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.

westbengalpanchyatpolls

బెంగాల్లోని ముర్షిదాబాద్ జిల్లాలో తీవ్ర హింసాకాండ చోటు చేసుకుంది. కపస్‌దంగా ప్రాంతంలో టీఎంసీ కార్యకర్త బాబర్ అలీ హత్యకు గురయ్యాడు. దాడిలో తీవ్రంగా గాయపడిన అతన్ని బహరంపూర్‌లోని ముర్షిదాబాద్‌ మెడికల్‌ కాలేజీ అండ్‌ హాస్పిటల్‌కు తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు ప్రకటించారు. ముర్షిదాబాద్ జిల్లాలోని రెజీనగర్‌లో శుక్రవారం జరిగిన నాటు బాంబు పేలుడులో ఒక టిఎంసి కార్మికుడు చనిపోయాడు. జిల్లాలోని ఖర్‌గ్రామ్‌లో మరో తృణమూల్‌ కార్యకర్తను కత్తితో పొడిచి చంపారు.

తూర్పు మిడ్నాపూర్‌లోని సోనాచురా గ్రామపంచాయతీకి చెందిన తృణమూల్ బూత్ ప్రెసిడెంట్ దేవ్‌కుమార్ రాయ్‌పై బీజేపీ కార్యకర్త సుబల్ మన్నా, అతని అనుచరులు దాడి చేశారు. జల్పైగురిలో తృణమూల్ అభ్యర్థిపై బీజేపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. హింసాకాండ మధ్య రాష్ట్రంలో కేంద్ర బలగాలను మోహరించాలని డిమాండ్ చేస్తున్న ప్రతిపక్ష పార్టీలపై టీఎంసీ ఇప్పటికీ విరుచుకుపడుతోంది.

మరోవైపు కూచ్ బెహార్‌లోని రాంపూర్‌లో గణేష్ సర్కార్‌ అనే టీఎంసీ బూత్ కమిటీ ఛైర్మన్‌ను కత్తితో పొడిచి చంపారు. ఈ ఘటన నిన్న అర్థరాత్రి చోటుచేసుకుంది. సర్కార్‌ను అలీపుర్‌దువార్‌లోని ఆసుపత్రికి తరలించారు, అక్కడ అతను చనిపోయినట్లు ప్రకటించారు. మరొక ఘటనలో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) కార్యకర్త హఫీజుర్ రెహమాన్‌పై కాల్పులు జరపడంతో గాయపడ్డారు. కూచ్ బెహార్ జిల్లాలోని ఓక్రాబరి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. రెహమాన్ కాంగ్రెస్ కూటమి అభ్యర్థి అన్సార్ అలీకి మామ.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+