పాత నోట్లుంటే నాలుగేళ్ల జైలుశిక్ష: కొత్త ఆర్డినెన్సుకు ఆమోదం, మార్చి 31 నుంచి అమలు
పెద్దనోట్ల రద్దుపై రూపొందించిన ఆర్డినెన్సుకు బుధవారం కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది.
న్యూఢిల్లీ: పాత నోట్లపై కేంద్రం కొత్త నిర్ణయం తీసుకుంది. బుధవారం అత్యవసరంగా భేటీ అయిన కేంద్ర కేబినెట్ పెద్దనోట్ల రద్దుపై రూపొందించిన ఆర్డినెన్సుకు ఆమోద ముద్ర వేసింది. ఈ ఆర్డినెన్సు ప్రకారం.. 2017 మార్చి 31 తర్వాత 10 కంటే ఎక్కువ పాతనోట్లు కలిగి ఉన్న వారికి 4 ఏళ్ల జైలుశిక్ష విధిస్తారు.
అలాగే మార్చి 31 తరువాత పాత నోట్లను మార్చుకునే వారికి, పాతనోట్ల లావాదేవీలలో పాలుపంచుకున్న వారికి రూ.5 వేలు జరిమానా విధిస్తారు. ఈ మేరకు రూపొందించిన ఆర్డినెన్సును ఆమోదించిన కేంద్ర కేబినెట్ దానిని రాష్ట్రపతి ఆమోదం కోసం రాష్ట్రపతి భవన్ కు పంపనుంది.

ఈ కొత్త ఆర్డినెన్సుకు ' ది స్పెసిఫైడ్ బ్యాంక్ నోట్స్ సెసేషన్ ఆఫ్ లయబిలిటీస్ ఆర్డినెన్స్'గా పీరు పెట్టారు. డిసెంబర్ 30 తర్వాత కూడా పాత రూ.500, రూ.1000 నోట్లు బ్యాంకుల్లో డిపాజిట్ చేయకుండా ఉన్నవారిపై న్యాయపరమైన చర్యలు తీసుకునేలా ఉన్న క్లాజును కూడా కేంద్ర ప్రభుత్వం ఈ ఆర్డినెన్సులో చేర్చింది.
నిజానికి రిజర్వు బ్యాంకు చట్టాన్ని సవరించాలని కేంద్రం తొలుత భావించింది. అయితే గడువు ముగిసిన వెంటనే పార్లమెంట్ సమావేశాలు నిర్వహించే వీలు లేకపోవడంతో కేంద్రం ఈ ఆర్డినెన్సు మార్గాన్ని ఎంచుకుంది. బ్యాంకులు, పోస్టాఫీసుల్లో కూడా పాత నోట్ల డిపాజిట్ కు గడువు డిసెంబర్ 30 మాత్రమే. ఈ గడువు తర్వాత మార్చి 31 వరకు కేవలం రిజర్వు బ్యాంకు వద్ద మాత్రమే పాతనోట్ల మార్పిడి జరుగుతుంది.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications