బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బెంగళూరులో ఇంటి యజమాని రేప్ చేశాడు, నాలుగేళ్ల చిన్నారి మృతి, మృత్యువుతో పోరాడి !

ఇంటి ముందు ఆడుకుంటున్న నాలుగేళ్ల చిన్నారి మీద ఇంటి యజమాని అత్యాచారం చెయ్యడంతో 9 రోజుల పాటు మృత్యువుతో పోరాడిన చిన్నారి చివరికి మరణించిన ఘటన బెంగళూరు నగరంలో జరిగింది.

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ఇంటి ముందు ఆడుకుంటున్న నాలుగేళ్ల చిన్నారి మీద ఇంటి యజమాని అత్యాచారం చెయ్యడంతో 9 రోజుల పాటు మృత్యువుతో పోరాడిన చిన్నారి చివరికి మరణించిన ఘటన బెంగళూరు నగరంలో జరిగింది. పోలీసులు, ఆసుపత్రి వైద్యుల నిర్లక్షం వలనే తమ కుమార్తె మరణించిందని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపించారు.

బెంగళూరులోని తలఘట్టపుర పోలీస్ స్టేషన్ పరిధిలో వాజరహళ్ళి బాలాజీ లేఔట్ లో మునిరాజు అనే కామాంధుడు నివాసం ఉంటున్నాడు. ఇతని ఇంటిలో నాలుగేళ్ల చిన్నారి కుటుంబ సభ్యులు అద్దెకు ఉంటున్నారు. ఆగస్టు 17వ తేదీ బాలిక తల్లి పనికి వెళ్లింది.

4-year-old girl rape victim dies in Bengaluru

ఆ సమయంలో ఇంటి ముందు ఆడుకుంటున్న నాలుగేళ్ల చిన్నారి మీద మునిరాజు అత్యాచారం చేశాడు. ఇంటికి వచ్చిన తల్లి రక్తపుమడుగులో పడి ఉన్న బాలిక నుంచి వివరాలు తెలుసుకుని తలఘట్టపుర పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చెయ్యకుండా ఆమెను అక్కడి నుంచి పంపించేశారు.

జయనగరలోని రాజీవ్ గాంధీ ఆసుపత్రికి బాలికను తీసుకెళ్లారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వైద్యులను వేడుకున్నా చికిత్స చెయ్యడానికి వారు నిరాకరించారు. చివరికి బాలికను సెయింట్ జాన్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు.

అత్యాచారం చెయ్యడంతో రక్తం ఎక్కువ పోవడంతో చికిత్స విఫలమై శనివారం బాలిక మరణించిందని సెయిట్ జాన్స్ ఆసుపత్రి వైద్యులు చెప్పారు. రాజీవ్ గాంధీ ఆసుపత్రి వైద్యులు సరైన సమయంలో చికిత్స చేసి ఉంటే తమ కుమార్తె బతికే అవకాశం ఉండేదని, పోలీసులు చికిత్స చేయించడానికి నికారకరించారని బాలిక కుటుంబ సభ్యులు ఆరోపించారు. కేసు నమోదు చేసిన పోలీసులు బాలికపై అత్యాచారం చేసిన మునిరాజు, సాక్షాలు నాశనం చెయ్యడానికి ప్రయత్నించిన అతని స్నేహితుడిని అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.

English summary
4-year-old girl rape victim dies after raped by her house owner Bengaluru on August 26th.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X