వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బెంగాల్లో మలుపు: ఒక్కరోజే బిజెపిలోకి 40 వేలమంది

By Srinivas
|
Google Oneindia TeluguNews

40,000 activists from TMC, Congress & CPM in Bengal join BJP
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో ఒకేసారి నలభై వేల మంది వివిధ పార్టీల కార్యకర్తలు భారతీయ జనతా పార్టీలో చేరారు! పశ్చిమ బెంగాల్లో ఇది పెద్ద రాజకీయ మలుపు. రాష్ట్రంలో కాంగ్రెస్, తృణమూల్, సిపిఎం పార్టీలకు చెందిన దాదాపు 40 వేల మంది కార్యకర్తలు ఒక్కసారే కమలతీర్థం పుచ్చుకున్నారు.

ఈ విషయాన్ని ఆ రాష్ట్ర బిజెపి అధ్యక్షులు రాహుల్ సిన్హా వెల్లడించారు. దీనిపై సిన్హా స్పందిస్తూ.. బెంగాల్ బిజెపిలో ఒక్కసారే ఇంతమంది చేరడం శుభపరిణామమన్నారు. రాహుల్ సిన్హా ఆదివారం జంగల్ మహల్ ఏరియాలోని లోధాషులి, గోపిబల్లావపూర్, నయగ్రామ్, మోహన్ పురలలో పలు సమావేశాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలువురు బిజెపిలో చేరినట్లు చెప్పారు.

ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లో బిజెపి చెప్పుకోదగ్గ స్థానాల్లో గెలుచుకోలేకపోయింది. అయితే గతంలో కంటే ఓటింగ్ శాతాన్ని భారీగా పెంచుకుంది. ఓటింగ్ శాతం దాదాపు నాలుగైదు రెట్లు పెరిగింది. ఈ నేపథ్యంలో రానున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నాటికి లెఫ్ట్ పార్టీల కంటే, అధికార తృణమూల్ కాంగ్రెసు పార్టీ కంటే ధీటుగా ఎదగాలని బిజెపి భావిస్తోంది.

రానున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ వర్సెస్ బిజెపిగా ఉండాలని కమలనాధులు భావిస్తున్నారు. ఇందుకోసం ప్రధాని మోడీ పావులు కూడా కదుపుతున్నారు. అమిత్ షా బెంగాలీ కూడా నేర్చుకుంటున్నారట. సార్వత్రిక ఎన్నికల్లో ఓటింగ్ శాతం బాగా పెరడం, ఇప్పుడు నలభై వేల మంది బిజెపిలో చేరడంపై కమలనాథులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

English summary
About 40,000 political workers in Jangalmahal belonging to parties including Trinamool Congress, Congress and CPM switched their allegiance and joined the BJP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X