పూణే బ్రోతల్స్ నుంచి 40 మంది ఆంధ్ర గర్ల్స్‌కి విముక్తి

తమకు అందిన సమాచారం మేరకు ఎస్పీ రమణ కుమార్ నేతృత్వంలోని సిఐడి బృందాలు పూణేలోని బ్రోతల్ హౌస్‌లపై దాడులు చేశాయి. ఆ సందర్భంగా ఆ బృందాలు ఎనిమిది బ్రోతల్ హౌస్ నిర్వాహకులను అరెస్టు చేశారు. పోలీసులు 40 మంది ఆంధ్రప్రదేశ్ అమ్మాయిలకు విముక్తి కలిగించి, వారిని హైదరాబాదు తీసుకుని వచ్చారు.
ఇదిలావుంటే, రాష్ట్ర రాజధాని హైదరాబాదులో పోలీసులు హైటెక్ వ్యభిచార ముఠాను రట్టు చేశారు. నగరంలోని ఓ హోటల్లో మంగళవారం రాత్రి రైడ్ నిర్వహించిన పోలీసులు ఇద్దరు నిర్వాహకులను, ఓ యువతిని అరెస్టు చేశారు. హోటల్ సిబ్బందిని కూడా అదుపులోకి తీసుకున్నారు.
దేశవ్యాప్తంగా దాడులు చేస్తాం: సిఐడి చీఫ్
దేశవ్యాప్తంగా వేశ్యా గృహాల పైన దాడులు చేస్తామని సిఐడి చీఫ్ చెప్పారు. బుధవారపేట వేశ్యా గృహాలపై దాడులు చేసి 29 మంది యువతులు, 9 మంది చిన్నారులను రక్షించామని, 10 మంది బ్రోకర్లను అరెస్టు చేశామని చెప్పారు. తప్పించుకున్న వారు వేశ్యా గృహాల్లో ప్రత్యక్షమవుతున్నారన్నారు.












Click it and Unblock the Notifications