Uttarakhand Tunnel: కాసేపట్లో సొరంగం నుంచి 41 మంది బయటికి-ఆస్పత్రి వరకూ గ్రీన్ ఛానల్..

ఉత్తరాఖండ్‌లోని సిల్క్యారా సొరంగంలో చిక్కుకుని 17 రోజులుగా నరకయాతన పడుతున్న 41 మంది కార్మికులు కాసేపట్టోల బయటికి రానున్నారు. నిర్మాణంలో ఉన్న సొరంగం హఠాత్తుగా కుప్పకూలడంతో మట్టి గడ్డల మధ్య ఇరుక్కుపోయిన వీరిని రక్షించేందుకు 17 రోజులుగా భారీ ప్రయత్నాలు జరిగాయి. ఇవి చివరికి ఫలించడంతో వారు బయటికి వచ్చేందుకు మార్గం సుగమం అయింది. దీన్ని నిర్ధారిస్తూ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ ట్వీట్ చేశారు.

41 మందిని కాపాడేందుకు శ్రమిస్తున్న సహాయక బృందాలు.. చివరి కొన్ని మీటర్ల శిధిలాలను తొలగించే పనిలో ఉన్నాయని, నిషేధిత మాన్యువల్ "ర్యాట్-హోల్"-మైనింగ్ టెక్నిక్‌కు ధన్యవాదాలని సీఎం ట్వీట్ లో తెలిపారు. అలాగే హైటెక్ యంత్రాలు లేదా ఆగర్లు దాదాపు 60 మీటర్ల రాళ్లను రంధ్రం చేయడంలో విఫలమయ్యాయని, వారిని కాపాడే మార్గాన్ని సృష్టించడానికి పైపులు వేసినట్లు ఆయన తెలిపారు.

41 Trapped Workers to be come out of Silkyara tunnel shortly after 17 days trouble

బాబా బౌఖ్ నాగ్జీతో పాటు కోట్లాది మంది దేశప్రజల అపారమైన దయ, అన్ని రెస్క్యూ టీమ్‌ల అవిశ్రాంత కృషి ఫలితంగా.. కార్మికులను బయటకు తీయడానికి సొరంగంలో పైపులు వేసే పని పూర్తయిందని సీఎం థామీ తెలిపారు. త్వరలో అంతా కార్మిక సోదరులను బయటకు తీసుకెళ్తారన్నారు. అధికారులు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, స్ట్రెచర్‌లతో అత్యవసర వైద్య సిబ్బంది ఇప్పుడు సొరంగంలోకి ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్నారని, కూలిపోయిన గుహలోకి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు.

మరోవైపు ఉత్తరాఖండ్ సొరంగం నుంచి కార్మికులు బయటికి వచ్చేసే క్షణాలు దగ్గరపడుతుండటంతో అధికారులు వారి కుటుంబ సభ్యుల్ని అక్కడికి రప్పించారు. అలాగే వారు కార్మికుల కోసం కొత్త బట్టలు కూడా తెచ్చుకున్నారు. సొరంగం నుంచి కార్మికులు బయటికి రాగానే వెంటనే వారిని అంబులెన్స్ లలో గ్రీన్ ఛానల్ ద్వారా ఆస్పత్రులకు తరలించేందుకు కూడా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+