ప్రమాదంపై ఎంక్వైరీ, బాధ్యులపై చర్యలు, విషాదకరమని కేజ్రీవాల్, రాహుల్, మోడీ ట్వీట్లు

ఢిల్లీ అనాజ్ మందీ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతోంది. 44 మంది మృతిచెందినట్టు తెలుస్తోంది. తెల్లవారుజామున ప్రమాదం జరగడం, చీకటి ఉండటంతో ఫ్యాక్టరీలో ఉన్న వారు బయటకు వెళ్లడానికి వీలులేకుండా పోయింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. క్షతగాత్రులను సమీపంలోని నాలుగు ఆస్పత్రులకు తరలించారు.

ఏం జరిగిందంటే..

ఏం జరిగిందంటే..

ఢిల్లీ ప్రమాదంపై సర్కార్ స్పందించింది. ఘటనకు గల కారణాలు దర్యాప్తులో తేలుతాయని పేర్కొన్నది. ప్రమాదం ఎవరు చేసినా ఉపేక్షించబోమని తేల్చిచెప్పింది. బాధ్యులపై చర్యలు తప్పవని ఢిల్లీ మంత్రి ఇమ్రాన్ హుస్సేన్ స్పష్టంచేశారు. ప్రమాద ఘటన స్థలానికి మంత్రులు చేరుకున్నారు. ఝాన్సీ రోడ్‌లో ఉన్న పరిశ్రమ 600 చదరపు అడుగుల్లో విస్తరించి ఉంది. ఉదయం 5.22 గంటలకు ప్రమాదం జరిగి ఉంటుంది. ఆ సమయంలోనే అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ వచ్చింది.

ఆస్పత్రికి..

ఆస్పత్రికి..

క్షతగాత్రులను ఎల్‌ఎన్‌జేపీ ఆస్పత్రి, రాం మనోహర్ లోహియా ఆస్పత్రి, హిందురావు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. అగ్నిప్రమాదం జరిగే సమయంలో ఫ్యాక్టరీలో 25 మంది నిద్రిస్తున్నారని అధికారులు పేర్కొన్నారు. కూలీలు రాత్రి అక్కడే పడుకొన్నారని చెప్పారు. అయితే మృతుల సంఖ్య పెరగడంతో అందులో ఎంతమంది ఉన్నారనే అంశంపై స్పష్టత లేకుండా పోయింది. మంటలను పూర్తిగా ఆపివేశామని.. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అగ్నిమాపక శాఖ అధికారులు పేర్కొన్నారు.

సాయం చేయండి: జేపీ నడ్డా


ప్రమాదంపై బీజేపీ కార్యనిర్వహక అధ్యక్షుడు జేపీ నడ్డా స్పందించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రమాదానికి సంబంధించి బీజేపీ కార్యకర్తలు పోలీసులు, సిబ్బందికి సాయం చేయాలని ట్విట్టర్ వేదికగా నడ్డా పిలుపునిచ్చారు.

విషాదకరం: కేజ్రీవాల్

ఫ్యాక్టరీలో ప్రమాదం విషాదకరమని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఘటనాస్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. అగ్నిమాపక సిబ్బంది చాలా చక్కగా విధులు నిర్వర్తించారని ట్వీట్ చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తామని చెప్పారు.

సానుభూతి: అమిత్ షా

సానుభూతి: అమిత్ షా

మృతుల కుటుంబాలకు అమిత్ షా సానుభూతి తెలిపారు. తెల్లవారుజామున జరిగిన ప్రమాదం కార్మికుల కుటుంబాల్లో విషాదం నింపిందని చెప్పారు. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. ప్రమాదానికి సంబంధించి సంబంధిత శాఖల సిబ్బంది సమన్వయంతో కలిసి పనిచేయాలని ఆదేశించారు.

రాహుల్ ట్వీట్

ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంపై కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ప్రమాదం వార్త తనను తీవ్రంగా కలచివేసిందని చెప్పారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. త్వరగా క్షతగాత్రులు కోలుకోవాలని ట్వీట్ చేశారు.

మోడీ ట్వీట్

ప్రమాదంపై ప్రధాని మోడీ స్పందించారు. ప్రమాదం చాలా భయాంకరంగా జరిగిందని చెప్పారు. మృతులకు సంతాపం తెలిపారు. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రమాద ఘటనపై అధికారులు సహాయ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+