వెయ్యి లోపు మరణాలు..46,148 కొత్త కేసులు: భారత్ కు కరోనా నుండి కాస్త ఊరట !!
భారతదేశంలో కరోనా కేసుల ఉధృతి కాస్త తగ్గుముఖం పడుతోంది. తాజాగా గత 24 గంటల్లో 46,148 కొత్త కరోనావైరస్ కేసులు, 979 మరణాలు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. నిన్న కరోనా కారణంగా 50,040 కొత్త కేసులు మరియు 1258 కొత్త మరణాలను నివేదించినప్పుడు ఈ సంఖ్య ఆదివారం కంటే కొంచెం తక్కువగా ఉంది.సుమారు రెండున్నర నెలల తర్వాత కరోనా కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 1000 లోపు నమోదయింది. ఇది కాస్త ఊరట కలిగిస్తున్న అంశంగా మారింది.

6 లక్షల కంటే దిగువకు యాక్టివ్ కేసులు
దేశంలో మొత్తం కోవిడ్ -19 కేసులు ప్రస్తుతం 3,02,79,331 గా ఉన్నాయని తెలుస్తుంది.మొత్తం మరణాల సంఖ్య 3,96,730 కు చేరుకుందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. భారతదేశంలో క్రియాశీల కోవిడ్ -19 కేసుల సంఖ్య 5,72,994 లేదా 1.94% కు తగ్గింది. ఇప్పటివరకు 2,93,09,607 మంది రోగులు కరోనా మహమ్మారి నుండి కోలుకున్నారు . గత 24 గంటల్లో 58,578 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇదే సమయంలో 17,77,309 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.

కొత్త కేసులను మించిన రికవరీలు .. కాస్త రిలీఫ్
రోజువారీ రికవరీలు ఇప్పుడు వరుసగా 46వ రోజు రోజువారీ కొత్త కేసులను మించి నమోదుకావడం కాస్త ఊరట కలిగించే అంశం .దేశవ్యాప్తంగా రికవరీ రేటు ప్రస్తుతం 96.75% గా నమోదు అవుతుంది. ఇక కరోనా థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో, కోవిడ్ -19వ్యాక్సినేషన్ లో భారతదేశం ఒక మైలురాయిని సాధించింది. గత 24 గంటల్లో 64,25,893 మందికి టీకాలు వేశారు. దేశంలో మొత్తం టీకాల సంఖ్య 32,36,63,297 కు చేరుకుంది.

వ్యాక్సినేషన్ లోనూ ఇండియా రికార్డు
కొత్త పాలసీ అమల్లోకి వచ్చిన తర్వాత గత వారంలో భారత్ 3 కోట్ల 91 లక్షలకు పైగా వ్యాక్సిన్ మోతాదులను ఇచ్చింది. ఈ మైలురాయి టీకాల సంఖ్య కెనడా, మలేషియా & సౌదీ అరేబియా వంటి అనేక దేశాల జనాభాను మించిపోయింది అని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ట్వీట్ చేసింది. టీకా డ్రైవ్ పెరుగుతున్న వేగం పట్ల ప్రధాని నరేంద్ర మోడీ గత వారం సంతృప్తి వ్యక్తం చేసినట్లు అధికారిక ప్రకటన తెలిపింది.భారతదేశంలో పెద్దలలో దాదాపు 5.6 శాతం మందికి రెండు మోతాదులతో టీకాలు వేయించారు. ఏదేమైనా, యునైటెడ్ స్టేట్స్లో, దేశ జనాభాలో 40 శాతానికి పైగా రెండు మోతాదులను ఇచ్చినట్టు తెలుస్తుంది.












Click it and Unblock the Notifications