అవమానం: ప్రధాని మోడీకి చెప్పు చూపిన వ్యక్తి అరెస్ట్
చెన్నై: ప్రధాని నరేంద్ర మోడీకి 'చెప్పు' చూపించిన ఓ 46 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. చెన్నైలో ఓ ప్రభుత్వం పథకం ఆవిష్కరణకు 2017 డిసెంబర్ 21న అక్కడికి వెళ్లిన ప్రధాని నరేంద్ర మోడీకి పాల్లిని అనే వ్యక్తి చెప్పు చూపిస్తూ అవమానపరిచాడు.
ఈ ఘటనపై సుమోటో ఫిర్యాదు దాఖలైన నేపథ్యంలో పాల్లిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతన్ని అరెస్ట్ చేసి, ఎగ్మోర్ కోర్టులో హాజరు పరిచారు. ప్రస్తుతం అతనిపై 15 రోజుల రిమాండ్ విధించారు.

కాగా, ప్రజాప్రతినిధులు లేదా రాజకీయ నాయకులపై ప్రజలు అసహనం చూపించడం ఇదే తొలిసారి కాదు. తమ నేతలపై ఉన్న అసహనాన్ని ప్రజలు, లీడర్ల దిష్టిబొమ్మలు దహనం చేసి, కూరగాయలు ముఖంపై విసిరేసి, ఇంకు, షూస్‌లు వారిపైకి విసురుతూ తమ నిరసనను వ్యక్తం చేస్తారు.
గతంలో కూడా ఇలాంటి కేసులు చాలానే నమోదయ్యాయి. ఇటీవలే ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌పై ఓ మహిళ కోడిగుడ్లను విసిరేసి తన నిరసనను వ్యక్తం చేసింది.












Click it and Unblock the Notifications