అందాల కాశ్మీరం గొంతు నులిమిన పహల్గామ్ ఉగ్రదాడి
Pahalgam Terror attack: ప్రపంచం మొత్తాన్నీ ఉలిక్కిపడేలా చేసిన ఉదంతం.. పహల్గామ్ ఉగ్రదాడి. 26 మందిని పొట్టనబెట్టుకున్న ఉగ్రవాదుల ఘాతుకానికి అమెరికా మొదలుకుని ఆఫ్ఘనిస్తాన్ దాకా దాదాపుగా అన్ని దేశాలు స్పందించాయి. భారత్‌కు అండగా నిలిచాయి. ఉగ్రవాద నిర్మూలనకు సహకరిస్తామని వెల్లడించాయి.
ఈ పరిణామాలు భారత్- పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలకు కారణమైంది. యుద్ధ వాతావరణానికి దారి తీసింది. రెండు దేశాలు కూడా యుద్ధ సన్నాహాలు మొదలు పెట్టాయి కూడా. భారత్, పాకిస్తాన్ రెండూ తమ నౌకాదళ విన్యాసాలను నిర్వహించాయి. అరేబియా సముద్రంపై మిస్సైల్ పరీక్షలను విజయవంతంగా పూర్తి చేశాయి. యుద్ధ వాహక నౌకల సామర్థ్యాన్నీ పరీక్షించుకున్నాయి.

పహల్గామ్ ఉగ్రవాదుల దాడి తరువాత జమ్మూ కాశ్యీర్‌లో 48 మంది ప్రముఖ పర్యాటక కేంద్రాలు మూత పడ్డాయి. ఈ మేరకు ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా సారథ్యంలో జమ్మూ కాశ్మీర్‌లో అధికారంలో ఉన్న నేషనల్ కాన్ఫరెన్స్ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకుంది. పర్యాటకుల భద్రతను దృష్టిలో పెట్టుకుని తాత్కాలికంగా వాటిని మూసివేసినట్లు వెల్లడించింది.
జమ్మూ కాశ్మీర్‌లో మొత్తంగా 87 పర్యాటక ప్రదేశాలు, రిసార్టులు, కాటేజీలు, ఎకో విలేజీలు ఉన్నాయి. వాటన్నింటికీ అధికారిక గుర్తింపు ఉంది. పెద్ద ఎత్తున పర్యాటకులు ఆయా ప్రాంతాలను సందర్శిస్తుంటారు. అందులో కొన్ని సమస్యాత్మక, సున్నిత ప్రాంతాల్లో ఉన్నవే. పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం సందర్శకుల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ 87 పర్యాటక కేంద్రాల్లో 48 ప్రదేశాలను మూసివేసింది.
ఇందులో- శ్రీనగర్ జిల్లాలోని జామియా మసీదు, బదమ్‌వారీ, రాజోరి కడల్ హోటల్ కనాజ్, ఆలి కడల్ జేజే ఫుడ్ రెస్టారెంట్, ఐవరీ హోటల్, పద్‌షాపాల్ రిసార్ట్స్ అండ్ రెస్టారెంట్, ఫకీర్ గుజ్రీలోని చెర్రీ ట్రీ రిసార్ట్, నార్త్ క్లిఫ్ కేఫ్, ఫారెస్ట్ హిల్ కాటేజ్, దారాలోని ఎకో విలేజ్ రిసార్ట్, అస్తాన్‌మార్గ్ వ్యూ పాయింట్, అస్తాన్‌మార్గ్ పారాగ్లైడింగ్, మమ్నేత్ అండ్ మహాదేవ్ హిల్స్, బుద్ధిస్ట్ మాంటిస్సోరి, దచిగామ్ - ట్రౌట్ ఫామ్ / ఫిషరీస్ ఫామ్, అస్తాన్‌పోరా లచ్‌పత్రి ఉన్నాయి.

అలాగే- బారాముల్లా జిల్లా పరిధిలోని వులర్/వాట్లాబ్, రామ్‌పొరా అండ్ రాజ్‌పొరా, చీర్‌హర్, మండిజ్-హమామ్-మర్కూట్ వాటర్ ఫాల్స్, ఖంపూ, బోస్నియా, విజి టోప్, బాబారేషి, ష్రుంజ్ వాటర్ ఫాల్స్, కమాన్ పోస్ట్, నాంబ్లాన్ వాటర్ ఫాల్స్, ఎకో పార్క్ ఖడ్నియార్, గోగల్దారా, హబ్బాదర్ ఖాటూన్ పాయింట్, రింగ్ వాలీ, బాదర్‌కోట్ పాయింట్ మూసివేశారు.
బుద్గాం జిల్లాలోని యూస్ మార్గ్, తౌసీ మైదాన్, దూధ్ పత్రి, అనంతనాగ్ జిల్లాలోని ప్రఖ్యాత సన్ టెంపుల్, వెరినాగ్ గార్డెన్, సింథాన్ టాప్, మార్గన్‌టాప్, అకాడ్ పార్క్ కూడా ఈ మూసివేత జాబితాలో ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్ ప్రధాన ఆదాయ వనరు పర్యాటకమే. పహల్గామ్‌లో అదే పర్యాటకులను దృష్టిలో పెట్టుకుని ఉగ్రవాదులు జరిపిన కాల్పులు- ఈ ప్రాంతం గొంతు నులిమినట్టయింది.












Click it and Unblock the Notifications