క్రిస్టియన్లకు పెరిగిన వేధింపులు.. గతేడాదితో పోలిస్తే 75 శాతం ఎక్కువ కేసులు
క్రిస్టియన్లపై వేధింపులు ఎక్కువ అవుతున్నాయి. గతేడాదితో పోలిస్తే 2021లో 75 శాతం ఎక్కువ కేసులు నమోదయ్యాయి. 2020లో క్రిస్టియన్లపై 486 కేసులు కాగా.. 2021లో అవీ 475కి చేరాయి. 2014 తర్వాత దేశంలో క్రిస్టియన్లపై ఎక్కువ కేసులు ఫైల్ అయ్యాయని యునైటెడ్ క్రిస్టియన్ ఫోరమ్ తెలిపింది.
క్రిస్టియన్లపై కేసులు పెరగడంతో టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేశామని వివరించింది. గత రెండు నెలల్లో 104 కేసులు ఫైల్ అయ్యాయని తెలిపింది. అక్టోబర్‌లో 77 కేసులు ఫైల్ అయ్యాయని సమాచారం. 2014లో 127, 2015లో 142, 2016లో 226, 2017లో 248, 2018లో 292, 2019లో 328 కేసులు వచ్చాయి.

ఉత్తరప్రదేశ్‌లో ఎక్కువ కేసులు వచ్చాయి. 102 ఇక్కడ రాగా.. ఛత్తీస్ గడ్ 90, జార్ఖండ్ 44, మధ్యప్రదేశ్ 38 కేసులు ఫైల్ అయ్యాయి. చాలా కేసులు ప్రార్థనా సమయం, సమూహలుగా ఉన్న సమయంలోనే వచ్చాయి. కొన్ని చోట్ల భౌతికంగా కూడా దాడులు చేశారు. మతపరంగా నినాదాలు కూడా చేశారు. నివేదిక ప్రకారం 210 మంది ఇప్పటికీ పోలీసుల అదుపులో ఉన్నారు. 46 మంది ప్రార్థనా సమయం, 34 ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
భారతదేశం ఉప ఖండం.. ఇక్కడ అన్నీ ప్రాంతాల వారు, మతాల వారు ఉంటారు. అందరికీ సమాన హక్కులు ఉంటాయి. మతం పేరుతో వేధించడానికి వీలు లేదు. ఎవరికీ నచ్చిన మతం వారు స్వీకరించొచ్చు.. కానీ మతం తీసుకుంటే దాడులు చేయడం మాత్రం తగదు.












Click it and Unblock the Notifications