యూపీలో మరో దారుణం: నెల రోజుల్లో 49 మంది చిన్నారుల మృతి
ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని గోరఖ్‌పూర్ ఆసుపత్రిలో చిన్నారు మృతి ఘటనను మర్చిపోకముందే అదే తరహలో యూపీలోని ఫరూఖాబాద్ ఆసుపత్రిలో 49 మంది చిన్నారులు మరణించారు.
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని గోరఖ్‌పూర్ ఆసుపత్రిలో చిన్నారు మృతి ఘటనను మర్చిపోకముందే అదే తరహలో యూపీలోని ఫరూఖాబాద్ ఆసుపత్రిలో 49 మంది చిన్నారులు మరణించారు.
దేశవ్యాప్తంగా ఇటీవల పలు రాష్ట్రాల్లో చిన్నారుల మరణాలు తీవ్రంగా సంచనం సృష్టిస్తున్నాయి. యూపీలోని గోరఖ్‌పూర్ ఆసుపత్రిలో చిన్నారుల మరణం తర్వాత జార్ఖండ్ రాష్ట్రంలో కూడ పౌష్టికాహరలోపంతో చిన్నారులు మరణించారు.

తాజాగా ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని ఫరూఖాబాద్‌లోని రామ్‌మనోహర్‌లోహియా ఆసుపత్రిలో ఈ ఘటన చోటుచేసుకొంది. నెల రోజుల వ్యవధిలో 49 మంది పిల్లలు చనిపోయారు. అప్పుడే పుట్టిన 19 మంది పిల్లలు కూడ ఈ ఘటనలో మృత్యువాతపడ్డారు.
ఆక్సిజన్ సరఫరా సక్రమంగా లేకపోవడం, మందుల కొరత కారణమని బంధువులు ఆరోపిస్తున్నారు. అయితే ఆసుపత్రి సిబ్బంది సకాలంలో స్పందించలేదని పిల్లల తల్లిదండ్రులు ఆరోపణలు గుప్పిస్తున్నారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసుకొని విచారణ జరుపుతున్నారు. ఎఫ్ఐఆర్‌లో ఆసుపత్రి మెడికల్ సూపరింటెండ్‌తో పాటు పలువురు వైద్యుల పేర్లను నమోదు చేశారు పోలీసులు.












Click it and Unblock the Notifications