అస్సాంలో భూకంపం: పరుగులు తీసిన జనం
గౌహతి: అస్సాం(అసోం)లో సోమవారం ఉదయం భూకంపం సంభవించింది. దీంతో ఒక్కసారిగా ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు. భూకంప తీవ్రత రిక్టార్ స్కేల్‌పై 5.1గా నమోదైంది.
భూప్రకంపనలకు నాగోన్ జిల్లా ధింగ్‌కు 22 కిలోమీటర్ల దూరంలోని ప్రాంతం భూకంప ప్రధాన కేంద్రంగా ఉందని షిల్లాంగ్‌లోని ప్రాంతీయ సెసిమలాజికల్ సెంటర్ పేర్కొంది.

కాగా, భూకంప తీవ్రత ఫలితంగా వాటిల్లిన ఆస్తి, ప్రాణనష్టం వివరాలపై ఇంకా సమాచారం తెలియరాలేదని అధికారులు పేర్కొన్నారు. భూప్రకంపనల తీవ్రత మధ్యస్థంగా ఉందని అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications