మేఘాలయ, అస్సాంతోపాటు ఈశాన్య రాష్ట్రాల్లో భూకంపం: జనం పరుగులు
గౌహతి: ఈశాన్య రాష్ట్రాలను భూకంపం వణికించింది. సోమవారం రాత్రి 8 గంటలకు మేఘాలయలో 5.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఆఫ్ సిస్మోలజీ ప్రకారం భూకంపం కేంద్రం మేఘాలయలోని చిరపుంజీకి ఆగ్నేయంగా 49 కి.మీ దూరంలో ఉంది. "భూకంపం తీవ్రత5.4గా నమోదైందని వెల్లడించింది.
పలు మీడియా నివేదికల ప్రకారం.. 5.4 తీవ్రతతో సంభవించిన భూకంపం మొత్తం ఈశాన్య ప్రాంతంలో, పొరుగున ఉన్న బంగ్లాదేశ్‌లో కూడా కనిపించింది. భూకంపం 10 కిమీ (6.2 మైళ్ళు) లోతులో అంచనా వేయబడింది. ఇది ఈశాన్య భారతదేశంలోని అస్సాం రాష్ట్రంలోని కరీంగంజ్‌కు వాయువ్యంగా 18 కిమీ దూరంలో ఉన్నట్లు యుఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది.

భూకంప తీవ్రత కొంత తక్కువగా ఉండటంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఆస్తినష్టం జరిగినట్లు ఎటువంటి నివేదికలు లేవు. అయితే, ఒక్కసారిగా భూమి కంపించడంతో నివాసాల్లోని ప్రజలు బయటకు పరుగులు తీశారు.
మరికొన్ని నివేదికల ప్రకారం.. సోమవారం రాత్రి గం.8:23 సమయానికి బంగ్లాదేశ్, మయన్మార్, భారత్ తదితర చోట్ల భూకంపం సంభవించింది. భారత్‌లోని ఈశాన్య రాష్ట్రలైన అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, త్రిపురలలోను ప్రకంపనలు చోటు చేసుకున్నాయి.
Earthquake of Magnitude:5.4, Occurred on 14-08-2023, 20:19:47 IST, Lat: 25.02 & Long: 92.13, Depth: 16 Km ,Location: 49km SE of Cherrapunjee, Meghalaya, India for more information Download the BhooKamp App https://t.co/KDGhxTgUId @Dr_Mishra1966 @moesgoi @KirenRijiju pic.twitter.com/XFaOjG4Nz9
— National Center for Seismology (@NCS_Earthquake) August 14, 2023
కాగా, మూడు రోజుల క్రితం అండమాన్ నికోబార్ దీవుల్లో (Andaman and Nicobar Islands) భూకంపం (Earthquake) వచ్చింది. గత శుక్రవారం తెల్లవారుజామున 2.56 గంటలకు పోర్టుబ్లేయిర్ సమీపంలో భూమి కంపించింది. దీని తీవ్రత 4.3గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) తెలిపింది.
పోర్టుబ్లేయిర్‌కు (Port Blair) 112 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని వెల్లడించింది. భూ అంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించినట్లు పేర్కొంది. భూకంపం వల్ల ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు.












Click it and Unblock the Notifications