ప్రధాని మోడీ పర్యటన వేళ బిగ్ షాక్.. అస్సాంలో భారీ భూకంపం !

ప్రధాని నరేంద్ర మోడీ అస్సాం పర్యటన వేళ రాష్ట్రంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈరోజు (సెప్టెంబర్ 14, 2025) సాయంత్రం 4:41 గంటలకు భూకంపం చోటు చేసుకుంది. రిక్టర్ స్కేల్‌పై 5.8 తీవ్రతగా నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. కేంద్రం అస్సాం రాష్ట్రం ఉదల్గురి జిల్లాలోని ధెకియజులి ప్రాంతానికి 16 కి.మీ దూరంలో, భూమి నుంచి 5 కి.మీ లోతులో ఉన్నట్లు స్పష్టం చేశారు.

కాగా భూకంప ప్రకంపనలు అస్సాంలోని ఉదల్గురి, సోనిత్‌పూర్, తమల్‌పూర్, నల్బరి జిల్లాలతో పాటు గౌహతిలోనూ సంభవించినట్టు చెబుతున్నారు. గౌహతిలో ప్రజలు భయంతో తమ ఇళ్లను వదిలి రోడ్లపైకి పరుగులు తీశారు. మణిపూర్ పశ్చిమ ప్రాంతాలు, అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఇటానగర్‌లోనూ ప్రజలు ఆందోళనకు గురయ్యారు. కొన్ని ఇళ్లు స్వల్పంగా ఊగినప్పటికీ, ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని ప్రకటించారు. ఈ ప్రకంపనలు ఈశాన్య రాష్ట్రాలతో పాటు పొరుగు దేశాలైన బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, మయన్మార్, చైనాల్లోనూ నమోదైనట్లు సమాచారం.

5-8-magnitude-earthquake-strikes-at-assam-while-pm-modi-tour

ఈ ఘటనపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ X (మునుపటి ట్విట్టర్)లో స్పందిస్తూ.. “భూకంప కేంద్రం ఉదల్గురి సమీపంలో ఉంది. ఇప్పటివరకు ఎటువంటి ప్రాణనష్టం లేదా ఆస్తినష్టం సమాచారం లేదు. మేము పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నాం” అని పేర్కొన్నారు. మరోవైపు వారం క్రితమే ఇదే ప్రాంతం సోనిత్‌పూర్ జిల్లాలో 3.5 తీవ్రతతో భూకంపాన్ని సంభవించింది. వరుసగా భూకంపాలు సంభవించడం ఆందోళన కలిగించే అంశమని నిపుణులు పేర్కొంటున్నారు.

ఇక ప్రస్తుతం ఈశాన్య రాష్ట్రాల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్రమోదీ అసోంలో రెండో రోజుల కూడా పర్యటించారు. రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ తనపై అలాగే తన తల్లిపై చేస్తున్న ప్రచారంపై కీలక వ్యాఖ్యలు చేశారు.

1962లో చైనా చొరబాటు సమయంలో నెహ్రూ సర్కార్ అనేక తడబాట్లు చేసిందని.. వాటి వల్ల అసోం ప్రజలు ఇప్పటికీ ఇబ్బందులు అనుభవిస్తున్నారని తెలిపారు. తనను ఎవరైనా దూషించినా తాను శివుడిలా విషాన్ని దిగమింగుతానని.. కానీ ఈశాన్య ప్రజలు ఆరాధించే వ్యక్తిని అవమానిస్తే మాత్రం సహించేది లేదని ఆయన భావోద్వేగం వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+