వైద్యులు, పోలీసులపై దాడి చేసిన వారిలో ఐదుగురికి కరోనా పాజిటివ్: పీఎస్ మూసివేత
లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మొరాదాబాద్‌లో వైద్య బృందం, పోలీసులపై రాళ్లు రువ్విన కేసులో అరెస్టైన వారిలో ఐదుగురికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆ కేసులో నిందితులందరినీ కరోనా క్వారంటైన్ కేంద్రానికి తరలించారు. అంతేగాక, వారిని ఉంచిన నగ్‌ఫని పోలీస్ స్టేషన్ ను మూసివేశారు.
మొరాదాబాద్‌లో కరోనా అనుమానితుడు ఉన్నట్లు గుర్తించిన వైద్య బృందం ఏప్రిల్ 15న పరీక్షలు నిర్వహించేందుకు అక్కడికి వెళ్లింది. దీంతో వైద్య బృందంతోపాటు వారి వెంట వచ్చి పోలీసులపైనా స్థానికులు రాళ్ల దాడి చేశారు. ఈ ఘటనలో ఓ వైద్యుడు, ఇద్దరు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. అంబులెన్స్ ధ్వంసమైంది.

ఈ దాడి ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్రంగా స్పందించారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేసి, కఠని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగినపోలీసులు దాడి ఘటనతో సంబంధం ఉన్న 10 మంది పురుషులు, 8 మంది మహిళలను అరెస్ట్ చేశారు.
ఆ తర్వాత వైద్య పరీక్షల నిమిత్తం నిందితులను లక్నోలోని రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రికి తరలించారు. కాగా, 18 మందిలో తాజాగా ఐదుగురు పురుషులకు కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యిందని ఆస్పత్రి ప్రధాన వైద్యాధికారి ఎంజీ గార్గ్ తెలిపారు. కరోనా పాజిటివ్ వ్యక్తులను ఐసోలేషన్ వార్డుకు తరలించి, వారిని కలిసిన వారందర్నీ క్వారంటైన్ తరలించినట్లు వెల్లడించారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications