దారుణం: తోటి బీఎస్ఎఫ్ జవాను కాల్పుల్లో ఐదుగురు జవాన్లు మృతి, మరో 10 మందికి గాయాలు
అమృత్‌సర్: పంజాబ్ రాష్ట్రంలోని అమృత్‌సర్‌లో బీఎస్ఎఫ్ క్యాంపులో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ జవాను.. తోటి జవాన్లపై కాల్పులు జరిపాడు. ఆ తర్వాత అతడు కూడా కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో మొత్తం ఐదుగురు బీఎస్ఎఫ్ జవాన్లు మృతి చెందారు.
ఈ ఘటన అమృత్‌సర్ ఖాసా గ్రామంలో ఉన్న బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ శిబిరంలో ఆదివారం ఉదయం చోటు చేసుకుంది. కాగా, మరో పది జవాన్లు ఈ కాల్పుల్లో గాయపడ్డారు. వారందరికీ స్థానిక గురునానక్ దేవ్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఉన్నతాధికారులు ఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు.

అమృత్‌సర్ ఖాసా క్యాంపులో దురదృష్టకర ఘటన చోటు చేసుకుందని సైనిక ఉన్నతాధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. కానిస్టేబుల్ సత్తెప్ప తోటి జవాన్లపై కాల్పులు జరపడంతో మొత్తం ఐదుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన మరో జవాను ఆరోగ్యంగా విషమంగా ఉంది. ఈ ఘటనపై పూర్థిస్థాయిలో దర్యాప్తునకు ఆదేశించామని సైనిక ఉన్నతాధికారులు వెల్లడించారు.












Click it and Unblock the Notifications