Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

టేకాఫ్ అవుతుండగా.. జెట్ బ్లాస్ట్, ఇండిగో ఫ్లైట్ కు త్రుటిలో తప్పిన ప్రమాదం

ఢిల్లీ నుంచి ముంబై వెళ్లేందుకు టేకాఫ్ కు సిద్ధమవుతున్న ఇండిగో విమానానికి త్రుటిలో పెను ప్రమాదం తప్పిపోయింది. శుక్రవారం సాయంత్రం ఢిల్లీ ఎయిర్ పోర్టులో ఈ ఘటన చోటు చేసుకుంది.

న్యూఢిల్లీ: ఢిల్లీ నుంచి ముంబై వెళ్లేందుకు టేకాఫ్ కు సిద్ధమవుతున్న ఇండిగో విమానానికి త్రుటిలో పెను ప్రమాదం తప్పిపోయింది. శుక్రవారం సాయంత్రం ఢిల్లీ ఎయిర్ పోర్టులో ఈ ఘటన చోటు చేసుకుంది.

పార్కింగ్ బేలోకి వచ్చిన స్పైస్ జెట్ విమానం హఠాత్తుగా జెట్ బ్లాస్ట్ అవడంతో ఆ ధాటికి ఇండిగో విమానం ముందరి కుడివైపు అద్దం పగిలిపోయింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ఇండిగో విమాన ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి.

5 Injured As Jet Blast Breaks IndiGo Bus Window At Delhi Airport

గాయపడిన ప్రయాణికులకు వెంటనే చికిత్స నిమిత్తం ఎయిర్ పోర్టులోని క్లినిక్ కు తరలించినట్లు ఇండిగో అధికార ప్రతినిధి తెలిపారు. ఈ ప్రమాదంపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) విచారణ జరుపుతోంది.

శుక్రవారం సాయంత్రం 4.50 గంటల ప్రాంతంలో ఢిల్లీ నుంచి ముంబై వెళ్లే ఇండిగో కోచ్ నెంబర్ 34.. ఈబే 17లో బోర్డింగ్ ప్రయాణికులతో సిద్ధంగా ఉన్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు ఇండిగో ఒక ప్రకటనలో పేర్కొంది.

అదే సమయంలో స్పైస్ జెట్ ఎస్ జీ-253 విమానం దానికి కేటాయించిన బేలో పార్కింగ్ చేసుకునేందుకు టర్న్ అవుతోందని, ఆ సమయంలో ఒక్కసారిగా జెట్ బ్లాస్ట్ అవడంతో ఆ ప్రభావానికి సమీపంలోనే ఉన్న ఇండిగో విమానం ముందరి కుడివైపు అద్దం పగిలిపోయిందని తెలిపింది. అయితే ఈ ప్రమాదంపై స్పైస్ జెట్ ఇంకా స్పందించలేదు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+