హర్యానాలో ఘోర రోడ్డు ప్రమాదం: ఐదుగురు దుర్మరణం..
చంఢీఘర్: హర్యానాలోని ఛర్కీ దాద్రి జిల్లాలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఢిల్లీ-హర్యానా రోడ్డుపై ఓ కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానిక పోలీస్ అధికారులు ఈ విషయాన్ని ధ్రువీకరించారు.

మృతుల్లో ఇద్దరు చిన్నారులు, ఇద్దరు మహిళలు ఉన్నట్టు సమాచారం. గాయపడ్డవారిని రోహ్ తక్ లోని పీజీఐఎంఎస్ ఆసుపత్రికి తరలించినట్టు పోలీసులు వెల్లడించారు. డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం వల్లే ప్రమాదం చోటు చేసుకున్నట్టు చెబుతున్నారు. మృతులకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియరావాల్సి ఉంది.












Click it and Unblock the Notifications