వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అదుపుతప్పి జనాలపైకి దూసుకెళ్లిన ఎలక్ట్రిక్ బస్సు: ఐదుగురు మృతి, పలువురికి గాయాలు

|
Google Oneindia TeluguNews

లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. శనివారం కాన్పూర్‌లోని టాట్ మిల్ క్రాస్‌రోడ్ సమీపంలో ఎలక్ట్రిక్ బస్సు అదుపు తప్పి అనేక మంది ప్రయాణికులను ఢీకొట్టడంతో ఐదుగురు వ్యక్తులు మరణించారు. మరికొంత మంది గాయపడ్డారు. ఘటనపై స్థానిక పోలీసులకు సమాచారం అందించారు.

బస్సు ప్రమాదంలో మూడు కార్లు, పలు బైక్‌లు సహా పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. బస్సు డ్రైవర్ పరారీలో ఉన్నాడు. పోలీసులు అతని కోసం వెతుకుతున్నారని ఈస్ట్ కాన్పూర్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ప్రమోద్ కుమార్ తెలిపారు.

5 Killed, Several Injured As Bus Loses Control in Kanpur, President Kovind Offers Condolence

క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించామని, కేసు దర్యాప్తు ప్రారంభించామని డీసీపీ తెలిపారు. కాగా, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. గాయపడిన వ్యక్తులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

కాన్పూర్ బస్సు ప్రమాదంలో పలువురు మృతి చెందిన వార్త పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో తమ ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను' అని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ట్వీట్ చేశారు.

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రమాద ఘటనపై విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు అన్ని రకాల వైద్య సహాయం అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.

'కాన్పూర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రజలు మరణించడం చాలా బాధాకరం. ఆయన పాదాల చెంత ఆయన ఆత్మకు చోటు కల్పించాలని, ఈ తీరని లోటును తట్టుకోగలిగే శక్తి వారి కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించాను' అని యూపీ సీఎం అన్నారు.

Recommended Video

IND Vs NZ : Team India Arrive In Kanpur For First Test || Oneindia Telugu

ఈ ఘటనపై తన సంతాపాన్ని వ్యక్తం చేస్తూ ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు ప్రియాంక గాంధీ ట్విటర్‌లో మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. "కాన్పూర్ నుంచి రోడ్డు ప్రమాదం గురించి చాలా విచారకరమైన వార్త అందింది. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను' అని ఆమె ట్వీట్ చేశారు.

English summary
5 Killed, Several Injured As Bus Loses Control in Kanpur, President Kovind Offers Condolence.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X