ఆ ఇంట్లో అయిదు మృతదేహాలు: దిగ్భ్రాంతికర స్థితిలో..!!
New Delhi: దేశ రాజధానిలో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన అయిదుమంది ఆత్మహత్య చేసుకున్నారు. విషాన్ని సేవించి బలవన్మరణానికి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని, మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్‌మార్టమ్ కోసం ఆసుపత్రికి తరలించారు.
ఢిల్లీ వసంత్ కుంజ్ సమీపంలోని రంగ్‌పురిలో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతులను హీరాలాల్, ఆయన నలుగురు కుమార్తెలు నీతు, నిషి, నీరు, నిధిగా గుర్తించారు. కుటుంబం మొత్తం ఆత్మహత్యకు పాల్పడటానికి గల కారణాలు ఇంకా తెలియరావట్లేదు గానీ- ఆర్థిక ఇబ్బందులేనని ప్రాథమికంగా అంచనా వేస్తోన్నారు.

హీరాలాల్ కార్పెంటర్‌గా పని చేసేవారు. చాలాకాలంగా రంగ్‌పురిలో నివసిస్తోన్నారు. ఏడాది కిందటే క్యాన్సర్ బారిన పడి ఆయన భార్య మరణించింది. భార్య చనిపోయాక ఇండియన్ స్పైనల్ ఇంజ్యూరీ సెంటర్‌లో దినసరి వేతన కార్మికుడిగా చేరారు. నలుగురు కుమార్తెలతో కుటుంబాన్ని నెట్టుకొస్తోన్నారు.
ఆ నలుగురు కుమార్తెలు కూడా దివ్యాంగులే. వారికి చికిత్స అందించడానికి తాహతుకు మించి ఖర్చు పెట్టడం, అప్పుల భారం అధికం కావడం వల్ల ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అంచనా వేస్తోన్నారు. రెండు రోజులుగా ఆ ఇంట్లో నుంచి ఎవరూ బయటికి రాకపోవడం పట్ల అనుమానాలు వ్యక్తం చేసిన ఇరుగు పొరుగు వాళ్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
#WATCH | Delhi: Visuals from the spot where a family of 5, a man and his four daughters, committed suicide by consuming a poisonous substance in Vasant Kunj's Rangpuri Village. https://t.co/EgU0neHEw8 pic.twitter.com/XGGvHNOLYK
— ANI (@ANI) September 28, 2024
సమాచారం అందుకున్న వెంటనే పోలీసుల సంఘటన స్థలానికి చేరుకున్నారు. తలుపులు లోపలి నుంచి గడియపెట్టి ఉండటం వల్ల వాటిని బద్దలు కొట్టాల్సి వచ్చింది. లోనికి వెళ్లి చూస్తే హీరాలాల్ ఆయన నలుగురు కుమార్తెలు నిర్జీవంగా కనిపించారు. చెల్లాచెదురుగా ఉన్న స్థితిలో అయిదు మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని పోస్ట్‌మార్టమ్ కోసం తరలించారు.












Click it and Unblock the Notifications