పుల్వామాలో మళ్లీ కాల్పుల మోత -భీకర ఎన్‌కౌంటర్లు -ఐదుగురు ఉగ్రవాదులు హతం -జవాన్లకూ గాయాలు

పాకిస్తాన్ సరిహద్దుకు దగ్గరగా ఉండే జమ్మూకాశ్మీర్ లోని పుల్వామా, షోపియాన్ జిల్లాల్లో భీకర ఎన్ కౌంటర్లు చోటుచేసుకున్నాయి. వేర్వేరు ఘటనల్లో మొత్తం ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. భద్రతా బలగాలకు చెందిన నలుగురు జవాన్లు కూడా గాయపడ్డారు. అధికారులు చెప్పిన వివరాలిలా ఉన్నాయి..

పుల్వామా జిల్లాలోని అవంతిపొర సమీప ప్రాంతాల్లో ముష్కరులు ఉన్నారనే సమాచారంతో భద్రతా బలగాలు, కశ్మీర్‌ పోలీసులు ఉమ్మడిగా గాలింపు చేపట్టారు. గురువారం సాయంత్రం నుంచి గాలింపు కొనసాగుతుండగా, శుక్రవారం ఉదయం టెర్రరిస్టులు కాల్పులు జరిపారు. దీంతో భద్రతా దళాల ఎదురు కాల్పులు జరిపారు.

5 militants killed, 4 jawans injured as separate encounters in JKs Shopian, Awantipora

అవంతిపొర ఎన్ కౌంటర్ లో గుర్తుతెలియని ఇద్దరు ఉగ్రవాదులు మృతిచెందారని కశ్మీర్‌ జోన్‌ పోలీసులు తెలిపారు. వారు ఏ సంస్థకు చెందినవారనే విషయం తెలియాల్సి ఉన్నదని వెల్లడించారు. ఇంకా దాక్కొని ఉన్న ఉగ్రవాదుల కోసం భద్రదళాలు ఆపరేషన్‌ కొనసాగిస్తున్నాయని చెప్పారు. మరోవైపు

షోపియాన్‌ జిల్లాలో కూడా ఉగ్రవాదులు, భద్రతా దళాలకు మధ్య గురువారం రాత్రి నుంచి ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. షోపియాన్‌ పట్టణంలో ఓ మసీదులో నక్కిన టెర్రరిస్టులు భద్రతా బలగాలపై కాల్పులు జరిపారు. ప్రతిగా సెక్యూరిటీ ఫోర్స్‌ జరిపిన కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. రెండు ఘటనల్లోనూ భద్రతా సిబ్బంది నలుగురికి గాయాలయ్యాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+