రాజకీయ పార్టీల ఆదాయం రూ. 1,276 కోట్లు
న్యూఢిల్లీ: గ్రాంట్లు, కానుకల రూపంలో దేశంలోని ఐదు జాతీయ పార్టీలకు ఒక ఏడాదిలో అక్షరాల రూ. 1,276 కోట్లు ఆదాయం సమకూరిందని తాజా వివరాలు వెల్లడించాయి. 2014-2015 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వివిధ పార్టీల ఆదాయాన్ని వెల్లడించాయి.
అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) ఈ వివరాలు వెల్లడించింది. ఈ లెక్కల ప్రకారం బీజేపీ గరిష్టంగా రూ. 970.43 కోట్ల ఆదాయంతో మొదటి స్థానంలో ఉంది. సీపీఎం రూ. 123.92 కోట్ల ఆదాయంతో రెండవ స్థానంలో ఉంది. బీఎస్ పీ రూ. 111 కోట్లతో మూడవ స్థానంలో ఉంది.

ఎన్సీపీ, సీపీఐ రూ. 67.64 కోట్ల ఆదాయాన్ని చూపించాయి. అయితే ఇప్పటి వరకు జాతీయ పార్టీ కాంగ్రెస్ మాత్రం ఇంత వరకు సమర్పించలేదని ఏడీఆర్ తెలిపింది. బీజేపీ మాత్రం భారీ మొత్తంలో ఆదాయాన్ని చూపించి అన్ని రాజకీయ పార్టీలకు చుక్కలు చూపించింది.
జాతీయ పార్టీలు ఇంత భారీ మొత్తంలో ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నాయని తెలుసుకున్న ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇంత వరకు ఎందుకు ఆడిట్ కాపీని చూపించడం లేదు అనే విషయంపై స్పందించడానికి ఆ పార్టీ నాయకులు నిరాకరిస్తున్నారు.












Click it and Unblock the Notifications