జమ్మూకశ్మీర్‌లో ఎదురుకాల్పులు.. 10 మంది మృతి
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో బుధవారం జరిగిన ఎదురు కాల్పుల్లో 10 మంది మృతి చెందారు. మృతుల్లో ఐదుగురు పోలీసులు, ఐదుగురు ఉగ్రవాదులు ఉన్నారు. మరో ఇద్దరు పోలీసులు కూడా గాయాలపాలయ్యారు.
హల్‌మత్పొరా ప్రాంతంలో ఏడుగురు ఉగ్రవాదులు దాక్కొని ఉన్నారనే సమాచారంతో సైన్యం, జమ్ముకశ్మీర్ పోలీసులకు చెందిన స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ సంయుక్త బృందం ఆపరేషన్ చేపట్టగా ఉగ్రవాదులు వారిపైకి కాల్పులు జరిపారు.

దీంతో సైన్యం, భద్రతాబలగాలు ఎదురు కాల్పులు ప్రారంభించారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇప్పటి వరకు మొత్తం 10 మంది మృతి చెందారు. మరోవైపు ఉగ్రవాదుల కోసం భద్రతాదళాల గాలింపు కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications