పెద్దల తీర్పు: రేపిస్టులకు ఐదు చెప్పు దెబ్బలు
చండీఘర్: ఓ గ్రామ పంచాయతీ పెద్దలు వింతైన తీర్పు చెప్పారు. హర్యానాలోని హిస్సార్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఓ మహిళపై అత్యాచారం చేసిన ఇద్దరికి ఐదేసి చెప్పు దెబ్బల చొప్పున శిక్ష విధించారు.
వారు దాంతో సరిపెట్టలేదు. అత్యాచార బాధితురాలిని ఊరు విడిచి వెళ్లాల్సిందిగా ఆదేశించారు. నిందితులపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు చర్యలకు ఉపక్రమించడానికి ముందే పంచాయతీ పెద్దలు తీర్పు చెప్పేశారు.

ఆగస్టులో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఓ దళిత మహిళ ఖాప్ పంచాయతీ ఆదేశాలపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది. జాట్ కమ్యూనిటీకి చెందిన వివాహితతో సోదరుడు పారిపోయినందుకు తనను, తన సోదరిని రేప్ చేసి ఊరేగించాలనే పంచాయతీ ఆదేశాలపై ఆ మహిళ కోర్టును ఆశ్రయించింది.












Click it and Unblock the Notifications